
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
శ్రీనగర్, జమ్మూకశ్మీర్ : కథువా గ్యాంగ్ రేప్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్రంగా ఖండించారు. దేశం ఎటు ప్రయాణిస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. స్వతంత్రం వచ్చి 70 ఏళ్లు గడిచినా ఇలాంటి ఘోరాలు దేశంలో జరగుతుండటం బాధాకరమని అన్నారు.
శ్రీ మాతా వైష్ణోదేవి విశ్వవిద్యాలయం ఆరవ స్నాతకోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరగకుండా కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. కాగా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూడా కథువా ఘటనను ఖండించారు.