ఉగ్రవాద దాడిలో పోలీసు మృతి | Policeman Shot Dead By Terrorists In Jammu And Kashmir's Pulwama | Sakshi
Sakshi News home page

ఉగ్రవాద దాడిలో పోలీసు మృతి

Aug 27 2016 2:57 PM | Updated on Aug 21 2018 8:06 PM

ఉగ్రవాద దాడిలో పోలీసు మృతి - Sakshi

ఉగ్రవాద దాడిలో పోలీసు మృతి

జమ్ములో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. పోలీసును లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు.

శ్రీనగర్: జమ్ములో  ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. పోలీసును లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు. ఈ ఉదంతంలో కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈఘటన శనివారం పుల్వామా  సమీపంలోని కొయిల్ గ్రామంలో చోటు చేసుకుంది.  ఖుర్షీద్ అహ్మద్ గనాయి కానిస్టేబుల్ గా పుల్వామా పోలీసు స్టేషన్ లో  విధులు నిర్వర్తిస్తున్నాడు. విధులు ముగించుకొని శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చాడు.

శనివారం ఉదయం బజారుకు వెళ్లగా ఆయనను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఖుర్షీద్ అక్కడికక్కడే మృతి చెందాడని పుల్వామా పోలీసులు తెలిపారు.  పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే పోలీసులను లక్ష్యంగా  చేసుకొని కాల్పులకు దిగుతున్నారని అధికారులు తెలిపారు. గత వారం పోలీసు కాన్వాయ్ ను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు గ్రానైడ్ దాడి చేయగా ఇద్దరు ఉన్నతాధికారులతో సహా, ఐదుగురు పోలీసులు మృతి చెందిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement