‘హిందువులను మోదీ అవమానించారు’ | PM Modi has insulted gau rakshaks, says Pravin Togadia | Sakshi
Sakshi News home page

‘హిందువులను మోదీ అవమానించారు’

Aug 14 2016 1:18 PM | Updated on Apr 6 2019 9:31 PM

‘హిందువులను మోదీ అవమానించారు’ - Sakshi

‘హిందువులను మోదీ అవమానించారు’

గో రక్షకులను సంఘ విద్రోహ శక్తులుగా పేర్కొని ప్రధాని మోదీ వారిని అవమానించారని విశ్వ హిందూ పరిషత్ విమర్శించింది.

న్యూఢిల్లీ: గో రక్షకులను సంఘ విద్రోహ శక్తులుగా పేర్కొని ప్రధాని మోదీ వారిని అవమానించారని విశ్వ హిందూ పరిషత్ విమర్శించింది. వీహెచ్‌పీ అగ్రనేత ప్రవీణ్ తొగాడియా మాట్లాడుతూ ‘గో రక్షకుల వివరాలు సేకరించాల్సిందిగా మోదీ రాష్ట్రాలను ఆదేశించారు. హిందువులు గోవును రక్షించడానికి ప్రాణాలను సైతం అర్పిస్తారు. కాబట్టి ఆయన జాతి పరంగా జాబితా సిద్ధం చేయమన్నట్లే’ అని తప్పుపట్టారు.

దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న మోదీ.. గో హంతకులకు క్లీన్చిట్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. అదే సమయంలో గోరక్షకులను బాధితులుగా మారుస్తున్నారని మండిపడ్డారు. గోమాతనే కాకుండా, హిందువులను కూడా మోదీ అవమానించారని తొగాడియా విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement