అన్నాచెల్లెళ్ల అనురాగం | people grandly celebrated rakhi festival | Sakshi
Sakshi News home page

అన్నాచెల్లెళ్ల అనురాగం

Aug 10 2014 10:45 PM | Updated on Sep 2 2017 11:41 AM

అన్న, చెల్లెళ్ల అనురాగానికి ప్రతికగా నిలిచిన ‘రక్షా బంధన్’ను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు.

సాక్షి, ముంబై: అన్న, చెల్లెళ్ల అనురాగానికి ప్రతికగా నిలిచిన ‘రక్షా బంధన్’ను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు.  తెలుగు ప్రజలు అత్యధికంగా నివాసం ఉండే కామాటిపుర, ప్రభాదేవి, ఖేడ్‌గల్లి, సయాని రోడ్, ఎల్ఫిన్‌స్టన్ రోడ్, లోయర్‌పరేల్, వర్లీ, సైన్ కోలివాడ, ప్రతీక్షనగర్, బాంద్రా, గోరేగావ్, మలాడ్, బోరివలి తదితర పాంతాల్లో పండుగా వాతావరణం కనిపించింది. దూరప్రాంతాల్లో ఉంటున్న సోదరీమణులు శనివారం సాయంత్రమే పుట్టింటికి చేరుకున్నారు.

 కొందరు ఆదివారం ఉదయం కూడా తరలిరావడం కన్పించింది. ముంబైలోని తెలుగు లోగిళ్లన్నీ సందడిగా, పిండి, తీపి వంటకాలతో ఝుమఝుమ లాడాయి. సొదరుల చేతికి రాఖీ కట్టి దేవుడు సల్లగా చూడాలని దీవెనలిచ్చారు. తన కు ఎల్లవేళలా రక్షణగా ఉండాలని కోరుకున్నారు.  ఒకరోజుముందే రాఖీలు విక్రయించే షాపులన్నీ కొనుగోలుదార్లతో కిటకిటలాడాయి. మిఠాయి షాపుల్లో కూడా రద్దీ కనిపించింది.

 తెలుగు గ్రామ సంఘ కార్యాలయంలో..
 నగరంలోని వివిధ తెలుగు సంస్థల కార్యాలయా ల్లో,  సంఘ గదుల్లో రాఖీ, జంధ్యాల పౌర్ణమి ఉత్సవాన్ని ఘనంగా జర్పుకున్నారు. ఖరాస్ బిల్డింగ్‌లోని ఓం పద్మశాలి సేవా సంఘం (కేంద్రం) అధ్యక్షుడు పోతు రాజారాం, ఓం పద్మశాలి విజయ సంఘం (కమ్మర్‌పల్లి) ముంబై శాఖ అధ్యక్షుడు గుడ్ల నడ్పి లింబాద్రి, మోర్తాడ్ సంఘం అధ్యక్షుడు కామని హన్మాండ్లు, చౌట్‌పల్లి సంఘం అధ్యక్షుడు బండి దామోదర్, వేల్పూర్, ధర్మోరా, హసకొత్తూర్, తిమ్మాపూర్,  ప్రభాదేవిలోని ఏర్గట్ల పద్మశాలి సం ఘం అధ్యక్షుడు ఎలిగేటి నడ్పి రాజారాం, వడాచి చాల్‌లోని మెండోరా, పోచంపల్లి, లక్ష్మిసదన్ భిల్డిం గ్‌లోని వెంచిర్యాల తదితర సంఘాల ఆధ్వర్యంలో రాఖీ, జంధ్యాల పౌర్ణమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

 పద్మశాలీల కుల దైవమైన మార్కండేయునికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తి శ్రద్ధలతో మంత్రోచ్ఛరణ చేస్తూ పాత జంధ్యాన్ని త్యజించి కొత్త జంద్యాన్ని ధరించారు. కొన్ని సంఘాలలో జంధ్యం మహాత్మ్యం గురించి చెప్పారు. హాజరైన సభ్యులందరికి శెనిగపప్పు, బెల్లం, పచ్చి కుడుకలు ప్రసాదంగా పంపణీ చేశారు.  కొండాపురం రామ బాల సంఘం (పద్మశాలి) ఆధ్వర్యంలో వర్లీలోని బి.డి.డి చాల్‌లో  ఘనంగా పూజలు నిర్వహించారు. సభ్యులందరికి జంద్యాల వితరణ చేశారు.  అధ్యక్షుడు ఇట్టె మురళి, ఉపాధ్యక్షుడు తాటి పాముల గంగాధర్, ప్రధాన కార్యదర్శి సామల్ల శ్రీహరి, ఉప కార్యదర్శి అనుమల్ల శ్రీనివాస్, కోశాధికారి చింతకింది శ్రీనివాస్  సలహాదారులు చింతకింద శంకర్, చింతకింద ఆనందం, జి. మురళి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement