ఎన్ఐఏ విచారణకు హాజరైన సల్వీందర్ | Pathankot attacks: Gurdaspur SP appears before NIA, may undergo lie-detector test | Sakshi
Sakshi News home page

ఎన్ఐఏ విచారణకు హాజరైన సల్వీందర్

Jan 11 2016 12:36 PM | Updated on Oct 17 2018 5:14 PM

ఉగ్రవాదులకు సహకరించి ఉండొచ్చని ఆరోపణలు ఎదుర్కొంటున్న గురుదాస్ పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్ సోమవారం ఉదయం ఎన్ఐఏ ఉన్నత కార్యాలయ సముదాయానికి వచ్చారు

కోల్కతా: ఉగ్రవాదులకు సహకరించి ఉండొచ్చని ఆరోపణలు ఎదుర్కొంటున్న గురుదాస్ పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్ సోమవారం ఉదయం ఎన్ఐఏ ఉన్నత కార్యాలయ సముదాయానికి వచ్చారు. సోమవారం తమ ముందు హాజరుకావాలని ఎన్ఐఏ ఇచ్చిన నోటీసుల ప్రకారం ఆయన సోమవారం ఉదయమే అక్కడికి చేరుకున్నారు. పఠాన్ కోట్ పై జైషే ఈ మహ్మద్ ఉగ్రవాదులు దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడికి పరోక్షంగా సల్వీందర్ సహకరించి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పఠాన్ కోట్ దాడికి ముందు తమను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారని, వారి వాహనాల్లో భారీ ఆయుధ సామాగ్రి కూడా ఉందని, తనను మధ్యలో జీపులో నుంచి తోసేసి వెళ్లిపోయారని సల్వీందర్ సింగ్ ఎన్ఐఏ అధికారులకు చెప్పారు. అనంతరం ఎన్ఐఏ సందించిన పలు ప్రశ్నలకు కూడా ఆయన పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు ఆయనపై మరింత అనుమానం పెరిగి లైడిటెక్టర్ పరీక్షలకు కూడా సిద్ధమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement