
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను ఆగస్టు 7వరకు పొడగిస్తున్నట్లు పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. కీలకమైన పలు బిల్లులు పెండింగ్‌లో ఉన్నందునే సమావేశాలను పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. బిల్లులపై ఓటింగ్ జరగాల్సిన నేపథ్యంలో సమావేశాలను పొడగించినట్లుగా తెలుస్తుంది. కాగా సమావేశాలు ముగిసే వరకూ ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోవద్దని బీజేపీఎంపీలకు హోంమంత్రి అమిత్‌షా సూచించినట్లు సమాచారం.