పాక్ కాల్పుల్లో అనంతపురం జవాను మృతి | Pakistani troops violate ceasefire by resorting to firing on Indian post | Sakshi
Sakshi News home page

పాక్ కాల్పుల్లో అనంతపురం జవాను మృతి

Oct 17 2014 10:31 AM | Updated on Mar 23 2019 8:41 PM

పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్ పూంఛ్ జిల్లాలోని...

శ్రీనగర్ : పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్ పూంఛ్ జిల్లాలోని బీఎస్ఎఫ్ శిబిరాలపై పాక్ శుక్రవారం కాల్పులు జరిపింది. అయితే  పాక్ కాల్పులను భారత జవాన్లు సమర్థవంతంగా తిప్పికొట్టారు.

 కాగా పాక్ సైన్యం కాల్పుల్లో అనంతపురం జిల్లాకు చెందిన ఓ జవాను మృతి చెందాడు. జవాను అనీల్ కుమార్ స్వస్థలం అనంతపురం జిల్లా తలుపుల మండలం తూపల్లి గ్రామం.  గతరాత్రి అనీల్ కుమార్ కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారులు సమాచారం అందించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement