'మా ముస్లింల గురించి పాక్కు అనవసరం' | pak need not to concern about indian muslims: rajnath singh | Sakshi
Sakshi News home page

'మా ముస్లింల గురించి పాక్కు అనవసరం'

Jul 21 2016 12:40 PM | Updated on Mar 9 2019 3:34 PM

'మా ముస్లింల గురించి పాక్కు అనవసరం' - Sakshi

'మా ముస్లింల గురించి పాక్కు అనవసరం'

కశ్మీర్ అల్లర్ల వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. గురువారం లోక్ సభలో కశ్మీర్ అల్లర్లపై చర్చ మొదలైంది.

న్యూఢిల్లీ: కశ్మీర్ అల్లర్ల వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. గురువారం లోక్ సభలో కశ్మీర్ అల్లర్లపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో రాజ్ నాథ్ వివరణ ఇస్తూ భారత్కు కశ్మీర్ కిరీటం వంటిదని అన్నారు. కశ్మీర్ అల్లర్లపై చర్చ జరగడం అనేది చాలా అవసరం, ముఖ్యమైనది కూడా అని చెప్పారు.  లష్కరే తాయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థల ప్రమేయం ఈ అల్లర్ల వెనుక ఉందని చెప్పారు. ఈ అల్లర్లకు ప్రధాన కారణమైన బృహాన్ మనీ హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థ కమాండర్ గా పనిచేశాడని అన్నారు.

సోషల్ మీడియా ద్వారా కశ్మీర్ యువకులను రెచ్చగొట్టారని అన్నారు. భారత్ లోని ముస్లింల గురించి పాకిస్థాన్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కశ్మీర్ విషయంలో ప్రజలంతా ఒక్కటిగా నిలుస్తున్నారని అన్నారు. ఈ సందర్బంగా భారత మాజీ ప్రధాని వాజ్ పేయి వినిపించిన కవితను రాజ్ నాథ్ వినిపించారు. భిన్నత్వంలో ఏకత్వమే భారత దేశ బలం అని చెప్పారు. మళ్లీ ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు తాము శాయశక్తులు కృషి చేస్తున్నామని అన్నారు. కశ్మీర్ పరిస్థితిని చక్కదిద్దుతాం అని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement