చిదంబరాన్ని అరెస్టు చేయకుండా ఊరట!

P Chidambaram gets interim relief from arrest by Delhi High Court - Sakshi

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్‌ నేత పీ చిదంబరానికి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో జూలై 3వరకు ఆయనను అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణ కల్పిస్తూ హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీచేసింది. జస్టిస్‌ ఏకే పాఠక్‌ ఈ కేసు విషయంలో సీబీఐకి నోటీసులు జారీచేశారు. చిదంబరం ముందస్తు బెయిల్‌పై సీబీఐ వైఖరి ఏమిటో తెలుపాలని న్యాయమూర్తి ఆదేశించారు.

అయితే, ఈ కేసు విచారణలో సీబీఐకి సహకరించాలని చిదంబరానికి న్యాయస్థానం ఆదేశించింది. సీబీఐ పిలిచినప్పుడల్లా విచారణకు హాజరుకావాలని సూచించింది. సీబీఐ తరఫున వాదనలు వినిపించిన అదనపు సోలిసిటర్‌ జనరల్‌ తుషాక్‌ మెహతా చిదంబరం అభ్యర్థనను వ్యతిరేకించారు. ఈ కేసుకు సంబంధించి ఆయన మొదట ట్రయల్‌ కోర్టును ఆశ్రయించాలని, హైకోర్టును కాదని ఆయన వాదించారు. అయితే, మెహతా వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో చిదంబరం గురువారం సీబీఐ ముందు హాజరుకావాల్సి ఉంది. ఎయిర్‌సెల్‌-మాక్సిస్‌ ఒప్పందం కేసులోనూ చిదంబరాన్ని అరెస్టుచేయకుండా ట్రయల్‌ కోర్టు మధ్యంతర ఉత్తర్వుల జారీచేసిన సంగతి తెలిసిందే.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top