మూతబడిన లక్షా 8వేల బ్యాంకు శాఖలు | One Lakh 8 thousand bank branches closed | Sakshi
Sakshi News home page

మూతబడిన లక్షా 8వేల బ్యాంకు శాఖలు

Nov 12 2014 4:07 PM | Updated on Sep 2 2017 4:20 PM

దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా 20 లక్షల కోట్ల రూపాయల మేర లావాదేవీలకు ఆటంకం ఏర్పడింది.

హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా 20 లక్షల కోట్ల రూపాయల మేర లావాదేవీలకు ఆటంకం ఏర్పడింది. దేశం మొత్తం మీద అన్ని బ్యాంకులకు చెందిన లక్షా 8వేల శాఖలు మూతపడ్డాయి.   బ్యాంకుల్లో చెక్కు  క్లియరెన్స్ వంటి సాధారణ బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిచిపోయాయి.  రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఏపీలలో  5వేల కోట్ల రూపాయల మేర లావాదేవీలకు ఆటంకం ఏర్పడింది.

ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం ఈరోజు సమ్మె చేస్తున్నారు. వేతన సవరణసహా పలు డిమాండ్ల సాధనలో భాగంగా సమ్మె చేయాలని ఉద్యోగ సంఘాలు తీసుకున్న నిర్ణయం మేరకు ఈ సమ్మె జరుగుతోంది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఉద్యోగులకు సమ్మె చేయడం మినహా గత్యంతరం లేకుండా పోయిందని యునెటైడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ (యూఎఫ్‌బీయూ) కన్వీనర్ ఎంవీ మురళి తెలిపారు. వేతన పెంపును 25 శాతం నుంచి 23 శాతానికి తగ్గించినా ఐబీఏ స్పందించలేదని తెలిపారు.
**

Advertisement

పోల్

Advertisement