27న ఒబామాతో మన్మోహన్ భేటీ | Obama, Manmohan to meet as per schedule on September 27 in US | Sakshi
Sakshi News home page

27న ఒబామాతో మన్మోహన్ భేటీ

Sep 6 2013 6:23 AM | Updated on Sep 1 2017 10:30 PM

27న ఒబామాతో మన్మోహన్ భేటీ

27న ఒబామాతో మన్మోహన్ భేటీ

వాషింగ్టన్‌లోని వైట్‌హౌజ్‌లో జరిగే ఈ భేటీ అనంతరం న్యూయార్క్‌లో నిర్వహించనున్న ఐక్యరాజ్యసమితి (యూఎన్‌వో) సాధారణ సభలో

ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ప్రసంగం తేదీ 28కి మార్పు!
 ఐక్యరాజ్యసమితి, వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ నెల 27న భేటీ కానున్నారు. వాషింగ్టన్‌లోని వైట్‌హౌజ్‌లో జరిగే ఈ భేటీ అనంతరం న్యూయార్క్‌లో నిర్వహించనున్న ఐక్యరాజ్యసమితి (యూఎన్‌వో) సాధారణ సభలో ప్రసంగించేందుకు మన్మోహన్ వెళతారు. అయితే, ముందుగా నిర్ణయించిన ప్రకారం మన్మోహన్ యూఎన్‌వోలో 27వ తేదీనే ప్రసంగించాల్సి ఉంది. కానీ, ఒబామాతో భేటీ నిమిత్తం దానిని 28వ తేదీకి మార్చారు. ఇప్పటికే రష్యాలో జరుగుతున్న జీ -20 దేశాల సదస్సులో ఒబామా, మన్మోహన్ పాల్గొంటున్నారు. కానీ, అక్కడ ద్వైపాక్షిక చర్చలేమీ జరిపే అవకాశం లేదని అధికారవర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement