ఓ ప్రత్యేకమైన వ్యక్తితో వీకెండ్‌‌: ఎంపీ

Nusrat Jahan Posts Adorable Pics With Boy Selling Balloons - Sakshi

‘ఈ వీకెండ్‌ ఓ ప్రత్యేకమైన వ్యక్తితో.. బెలూన్ల కంటే తనే ఎంతో కలర్‌ఫుల్‌గా ఉన్నాడు’ అంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ, నటి నుస్రత్‌ జహాన్‌ పోస్ట్‌ చేసిన ఫొటోలు నెటిజన్ల మనసు దోచుకుంటున్నాయి. బెలూన్లు అమ్ముకునే పిల్లాడిని హత్తుకుని.. అతడిని ముద్దాడుతున్న నుస్రత్‌ వ్యక్తిత్వానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘మీరు చాలా గొప్పవాళ్లు మేడమ్‌.. మీ మనసు విశాలమైంది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. నుస్రత్‌ సదరు బాలుడితో ఉన్న ఫొటోలపై ప్రశంసలు కురిపిస్తూ వేలల్లో లైకులు కొడుతున్నారు.  

కాగా బెంగాలీ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నుస్రత్‌ జహాన్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి ఎంపీగా గెలుపొందిన విషయం తెలిసిందే. టర్కీకు  చెందిన వ్యాపారవేత్త నిఖిల్‌ జైన్‌ను వివాహం చేసుకున్న ఆమె.. పెళ్లి తర్వాతే ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. బసిర్‌హాట్‌ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న నుస్రత్‌.. అస్తమాతో బాధపడుతూ ఇటీవల ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం కోలుకున్న ఆమె వివిధ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top