ఎన్‌ఆర్‌ఐలు భారత్‌లో ఇల్లు కొనుక్కోవచ్చు | NRIs can buy house in India, rules consumer body | Sakshi
Sakshi News home page

ఎన్‌ఆర్‌ఐలు భారత్‌లో ఇల్లు కొనుక్కోవచ్చు

Feb 9 2016 10:23 AM | Updated on Jul 6 2019 12:42 PM

ఎన్‌ఆర్‌ఐలు భారత్‌లో ఇల్లు కొనుక్కోవచ్చు - Sakshi

ఎన్‌ఆర్‌ఐలు భారత్‌లో ఇల్లు కొనుక్కోవచ్చు

ప్రవాస భారతీయులకు భారత్‌లో ఇల్లు కొనుక్కొనే హక్కు ఎప్పటికీ ఉంటుందని జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ తెలిపింది.

న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులకు భారత్‌లో ఇల్లు కొనుక్కొనే హక్కు ఎప్పటికీ ఉంటుందని జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ తెలిపింది. ఢిల్లీవాసి రేష్మా భగత్, ఆమె కొడుకు, ఎన్‌ఆర్‌ఐ తరుణ్‌లకు రూ.63,99,727 చెల్లించాలని సూపర్‌టెక్ బిల్డర్స్‌ను కమిషన్ ఆదేశించింది.

రేష్మా, తరుణ్‌లు 2008లో సూపర్‌టెక్‌కు ఈ మొత్తాన్నీ చెల్లించి గ్రేటర్ నోయిడాలో ఫ్లాట్ బుక్ చేసుకున్నారు. ఫ్లాట్ నిర్మించి అప్పగించకపోవడంతో వీరు కమిషన్‌ను ఆశ్రయించారు. నష్టపరిహారంగా రూ.1.4 కోట్లు ఇప్పించాలని కోరారు. నివసించడానికి కాకుండా వాణిజ్య అవసరాలకు వారు వాడాలనుకున్నారన్న సంస్థ వాదనను కమిషన్ తోసిపుచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement