మోదీతో భేటీకి రాజకీయ ప్రాధాన్యం లేదు: నితీశ్‌ | Nitish spurns Sonia's lunch to feast with Modi | Sakshi
Sakshi News home page

మోదీతో భేటీకి రాజకీయ ప్రాధాన్యం లేదు: నితీశ్‌

May 28 2017 12:58 AM | Updated on Oct 22 2018 9:16 PM

మోదీతో భేటీకి రాజకీయ ప్రాధాన్యం లేదు: నితీశ్‌ - Sakshi

మోదీతో భేటీకి రాజకీయ ప్రాధాన్యం లేదు: నితీశ్‌

ప్రధాని మోదీతో తన భేటికి ఎలాంటి రాజకీయాలు ఆపాదించొద్దని బిహార్‌ సీఎం, జేడీయూ అధ్యక్షుడు నితీశ్‌ కుమార్‌ అన్నారు.

న్యూఢిల్లీ: ప్రధాని మోదీతో తన భేటికి ఎలాంటి రాజకీయాలు ఆపాదించొద్దని బిహార్‌ సీఎం, జేడీయూ అధ్యక్షుడు నితీశ్‌ కుమార్‌ అన్నారు. కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ శుక్రవారం ఇచ్చిన విందుకు గైర్హాజరైన నితీశ్‌.. శనివారం మోదీతో భేటీ అయ్యారు. దీంతో ఇరువురి కలయిక కొత్త రాజకీయ సమీకరణాలకు దారి తీస్తుందన్న కథనాలు వినిపించాయి.

ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని అన్నారు. మారిషస్‌ ప్రధాని గౌరవార్థం జరిగిన విందుకు ప్రధాని తనను ఆహ్వానించారని చెప్పారు.మారిషస్‌లో సగానికి సగం బిహార్‌ మూలాలున్న ప్రజలున్నారని చెప్పారు. బిహార్‌ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు తాను ఇక్కడకు వచ్చినట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement