హోం శాఖను తనవద్దే ఉంచుకున్న నితీష్ | Nitish Kumar will hold the Home and Personnel portfolios | Sakshi
Sakshi News home page

హోం శాఖను తనవద్దే ఉంచుకున్న నితీష్

Nov 20 2015 6:36 PM | Updated on Sep 3 2017 12:46 PM

హోం శాఖను తనవద్దే ఉంచుకున్న నితీష్

హోం శాఖను తనవద్దే ఉంచుకున్న నితీష్

బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ శుక్రవారం ఐదోసారి ప్రమాణస్వీకారం చేశారు.

పాట్నా: ఐదోసారి బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కీలకమైన హోం శాఖను నితీష్ తన వద్దే ఉంచుకున్నాడు. నితీష్ కేబినెట్లో లాలు ప్రసాద్ కుమారులకు కీలకమైన మంత్రి పదవులు దక్కాయి. లాలు చిన్న కుమారుడు 26 ఏళ్ల తేజస్వికు రోడ్డు, భవనాల శాఖ మంత్రిత్వ శాఖను కేటాయించడంతో పాటు ఉపముఖ్యమంత్రి హోదాను ఇవ్వడం జరిగింది. లాలు పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్‌కు ఆరోగ్యశాఖను కేటాయించారు.

నితీష్ కేబినెట్లో మొత్తం 28 మంది సభ్యులు మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో అబ్దుల్ బారి సిద్ధిఖీ, రాజీవ్ రంజన్ సింగ్, బిజేంద్ర ప్రసాద్ యాదవ్, జయ కుమార్ సింగ్, శ్రావణ్ కుమార్ సింగ్, అలోక్ మెహతా తదితరులు ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement