ప్రత్యేక హోదాకు నితీశ్‌ డిమాండ్‌ | Nitish demand for special status | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదాకు నితీశ్‌ డిమాండ్‌

Jul 29 2017 1:28 AM | Updated on Sep 5 2017 5:05 PM

ఎన్డీయేలో అధికారికంగా భాగస్వామి అయిన జేడీయూ మరోసారి బిహార్‌కు ప్రత్యేక హోదా నినాదాన్ని తెరపైకి తెచ్చింది.

సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: ఎన్డీయేలో అధికారికంగా భాగస్వామి అయిన  జేడీయూ మరోసారి బిహార్‌కు ప్రత్యేక హోదా నినాదాన్ని తెరపైకి తెచ్చింది. ప్రమాణ స్వీకారం తర్వాత పార్టీ నేతలతో సమావేశమైన నితీశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావటంపై చర్చించారు. బీజేపీతో చేతులు కలపటం వల్ల ఆర్జేడీ, కాంగ్రెస్‌ నుంచి నితీశ్‌పై విమర్శలు తప్పవు.

ఈ నేపథ్యంలో బిహార్‌ అభివృద్ధిపై దృష్టి పెట్టడం వల్ల ప్రజల దృష్టిని మరల్చవచ్చన్నది జేడీయూ ఆలోచన. దీనికి తోడు రెండు దశాబ్దాల తర్వాత రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే కూటమి అధికారంలోకి రావటంతో ప్రజలకు సాధారణంగానే అంచనాలు పెరుగుతాయని పార్టీ భావిస్తోంది. ప్రత్యేక హోదా రావటం వల్ల రాష్ట్రానికి 90 శాతం కేంద్ర నిధులు వివిధ పథకాల కోసం అందుతాయి. పార్లమెంటులోనూ పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదాతో బిహార్‌ జాతీయ అభివృద్ధి సగటును చేరుకునేందుకు వీలవుతుందని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement