సునంద పుష్కర్‌ మృతి కేసులో కొత్తకోణం! | New angle in Sunanda Pushkar death case | Sakshi
Sakshi News home page

సునంద పుష్కర్‌ మృతి కేసులో కొత్తకోణం!

Jan 12 2015 3:03 AM | Updated on Sep 2 2017 7:34 PM

సునంద పుష్కర్‌

సునంద పుష్కర్‌

కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌ భార్య సునంద పుష్కర్‌ మృతి కేసుకు సంబంధించి మరో కోణం వెలుగులోకి వచ్చింది.

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌ భార్య సునంద పుష్కర్‌ మృతి కేసుకు సంబంధించి మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఆమె మరణానికి ఐపీఎల్(ఇండియన్ ప్రిమీయర్ లీగ్) మాఫియా కారణమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుబాయ్‌లో గొడవ, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో థరూర్‌కు చెంప దెబ్బ వెనకాల మరో మహిళ ప్రస్తావన ఐపీఎల్ కోణాన్ని తెర ముందుకు తెచ్చాయి. చివరగా ఫోన్‌లో మీ చాప్టర్‌ క్లోజ్‌ అంటూ సునంద థరూర్‌కు ఇచ్చిన వార్నింగ్స్‌పై పోలీసులు దృష్టి సారించారు.

 సునంద ఆకస్మిక మరణం వెనకాల ఐపీఎల్ మాఫియా హస్తం వుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సునంద మృతికి ముందు సునీల్‌ సాహెబ్‌ అనే వ్యక్తితో ఆమె మాట్లాడినట్లు వారింట్లో పనివాడు నారాయణ్‌ చెప్పడంతో  పోలీసుల విచారణ అటువైపు మళ్లింది. ఫ్యామిలీ ఫ్రెండ్‌, సునంద వ్యాపార మిత్రుడు సునీల్‌ త్రక్రు ఇంటరాగేషన్‌లో ఐపీఎల్ కోణం వెల్లడైనట్లు తెలుస్తోంది.   ఈ ఇంటరాగేషన్‌లో మరో మహిళ కేటీ ప్రస్తావన వచ్చింది. కేటీ గురించి దుబాయ్‌లో సునంద, థరూర్‌ ఇద్దరు గొడవ పడ్డారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తరువాత థరూర్‌తో కలిసి లోఢి ఎస్టేట్‌లోని తమ ఇంటికి వెళ్లేందుకు సునంద ఇష్ట పడలేదు. కోపంతో థరూర్‌ను చెంప దెబ్బ కూడా కొట్టింది.

 సునీల్‌ త్రక్రుని పిలిచి అతని కారులో హోటల్‌ లీలాకు సునంద వెళ్లింది. కాసేపటికి థరూర్‌ ఫోన్‌తో కొన్ని ట్వీట్లు చేయడంతో పాటు కొన్నింటిని కాపీ చేసింది. సునీల్‌ ఫోన్‌తో పాటు జాకడ్‌ అనే మరో వ్యక్తి ఫోన్‌ నుండి కూడా సునంద ట్వీట్లు చేసింది. ఆ తర్వాత థరూర్‌కు ఫోన్‌ చేసి 'మీడియాకు అంతా చెప్పేశాను, మీ చాప్టర్‌ క్లోజ్‌' అంటూ చెప్పినట్లు పనివాడు నారాయణ్‌ పోలీసులకు తెలినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం ఆధారంగా ఐపీఎల్ మాఫియా  కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు మొదలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement