24 గంటలు 30 మరణాలు, 693 కేసులు

National Health Joint Secretary Lav Agarwal Releases Health Bulletin Over Coronavirus - Sakshi

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌​ అగర్వాల్‌ ప్రకటక

సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సోమవారం సాయంత్రం నాటికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,067కి చేరింది. గడిచిన 24 గంటల్లో 693 పాజిటివ్‌ కేసులు నమోదు అవ్వడంతో పాటు 30 మంది వైరస్‌ బాధితులు మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌​ అగర్వాల్‌ ఓ ప్రకటక విడుదల చేశారు. ఇక ఢిల్లీలోని మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారిలో 1445 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు దేశంలో నమోదైన కేసుల్లో 76శాతం పురుషులే ఉన్నారని లవ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. మరోవైపు దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ.1100 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించారు. మరో మూడువేల కోట్లు రాష్ట్రాలకు కేటాయిస్తామని తెలిపారు. (మూడోదశకు కరోనా వైరస్‌ : ఎయిమ్స్‌ )

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top