బోస్‌ బతికున్నారో లేదో చెప్పండి: సీఐసీ

National Archives Told To Reply On RTI Seeking Details Of Netaji's Death - Sakshi

న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ బతికే ఉన్నారా? చనిపోయారా అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిందిగా జాతీయ అర్కైవ్స్‌ విభాగాన్ని కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) ఆదేశించింది. బోస్‌పై అవధేశ్‌ కుమార్‌ చతుర్వేది అనే వ్యక్తి ప్రధాని కార్యాలయాన్ని సమాచార హక్కు చట్టం కింద అభ్యర్థించారు. 2015, 16ల్లో బోస్‌ జయంతి రోజున ప్రధాని ఎందుకు నివాళి అర్పించారో చెప్పాలన్నారు. సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో సీఐసీని ఆశ్రయించారు. సంబంధిత రికార్డులన్నీ జాతీయ అర్కైవ్స్‌ విభాగం వద్ద ఉన్నాయని పీఎంవో చెప్పడంతో 15 రోజుల్లోగా దరఖాస్తుదారుడికి స్పష్టమైన సమాచారం ఇవ్వాలని ప్రధాన సమాచార కమిషనర్‌ ఆర్కే మాథుర్‌ అర్కైవ్స్‌ విభాగాన్ని ఆదేశించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top