breaking news
National Archives of India
-
బోస్ బతికున్నారో లేదో చెప్పండి: సీఐసీ
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ బతికే ఉన్నారా? చనిపోయారా అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిందిగా జాతీయ అర్కైవ్స్ విభాగాన్ని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఆదేశించింది. బోస్పై అవధేశ్ కుమార్ చతుర్వేది అనే వ్యక్తి ప్రధాని కార్యాలయాన్ని సమాచార హక్కు చట్టం కింద అభ్యర్థించారు. 2015, 16ల్లో బోస్ జయంతి రోజున ప్రధాని ఎందుకు నివాళి అర్పించారో చెప్పాలన్నారు. సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో సీఐసీని ఆశ్రయించారు. సంబంధిత రికార్డులన్నీ జాతీయ అర్కైవ్స్ విభాగం వద్ద ఉన్నాయని పీఎంవో చెప్పడంతో 15 రోజుల్లోగా దరఖాస్తుదారుడికి స్పష్టమైన సమాచారం ఇవ్వాలని ప్రధాన సమాచార కమిషనర్ ఆర్కే మాథుర్ అర్కైవ్స్ విభాగాన్ని ఆదేశించారు. -
గాడ్సే చెప్పిందేంటి?
గాంధీ హత్య కేసు వివరాలు చెప్పాలంటూ ఎన్ఏఐని ఆదేశించిన సీఐసీ న్యూఢిల్లీ: గాంధీజీ హత్య కేసు వివరాలను, హంతకుడు నాథురామ్ గాడ్సే విచారణలో ఇచ్చిన వాంగ్మూలాన్ని వెల్లడించాలని నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియాను (ఎన్ఏఐ) కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఆదేశించింది. ఆ వివరాలన్నింటిని ఎన్ఏఐ వెబ్సైట్లో పొందుపరచాలని సూచించింది. చార్జ్‌షీట్, వాంగ్మూలాన్ని వెల్లడించాలని అశుతోష్ బన్సాల్ అనే వ్యక్తి ఢిల్లీ పోలీసులకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఈ దరఖాస్తును ఢిల్లీ పోలీసులు ఎన్ ఏఐకి బదిలీ చేశారు. కాగా, ఆ వివరాలను తమ వెబ్సైట్లో శోధించి కావాల్సిన సమాచారాన్ని పొందాలని దరఖాస్తుదారుడికి ఎన్ ఏఐ సూచించింది. దీంతో సమాచారాన్ని పొందడంలో విఫలమైన బన్సాల్.. సీఐసీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులును ఆశ్రయించాడు. ఆయన స్పందించి దరఖాస్తుదారుడు అడిగిన సమాచారాన్ని రికార్డ్స్‌లో ఇండెక్స్‌తో సహా అందించాలన్నారు. దరఖాస్తుదారుడి నుంచి పేజీకి రూ. 2 చొప్పున వసూలు చేస్తూ 20 రోజుల్లోగా గాంధీ హత్య కేసు చార్జ్‌షీట్ పత్రాలను, గాడ్సే వాంగ్మూలాన్ని సీడీ రూపంలో అందించాలని ఆదేశించారు.