పీఎంఓలో ఓ రౌండు అలా తిరిగొచ్చా! | Narendra Modi walks through PMO, posts picture | Sakshi
Sakshi News home page

పీఎంఓలో ఓ రౌండు అలా తిరిగొచ్చా!

May 29 2014 11:07 AM | Updated on Aug 15 2018 2:20 PM

ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురువారం ఉదయాన్నే తన కార్యాలయం (పీఎంఓ)లో అలా.. ఓసారి తిరిగారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురువారం ఉదయాన్నే తన కార్యాలయం (పీఎంఓ)లో అలా.. ఓసారి తిరిగారు. అన్ని విభాగాలను దగ్గరుండి పరిశీలించారు. అక్కడున్న అధికారులతో మాటలు కలిపి విషయాలు తెలుసుకున్నారు. అలాగే, అక్కడున్న సదుపాయాల గురించి అధికారులను అడిగారు.

అంతే.. వెంటనే ఆ ఫొటోను తన ట్విట్టర్లో పోస్ట్ చేసేశారు. ''ఉదయాన్నే సౌత్ బ్లాక్కు వెళ్లి, పీఎంఓలో ఓ రౌండు తిరిగొచ్చా'' అని అందులో పేర్కొన్నారు. పసుపు పచ్చటి కుర్తా, తెల్లటి చుడీదార్ ధరించిన ఆయన అధికారులతో మాట్లాడుతున్న ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కాగా, మరోవైపు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ గురువారం నాడు ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ముచ్చటించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement