మాజీ సీఎంను పిలిపించిన మోదీ? | Narendra Modi summons former Gujarat CM Anandiben Patel | Sakshi
Sakshi News home page

మాజీ సీఎంను పిలిపించిన మోదీ?

Sep 10 2016 8:23 PM | Updated on Aug 24 2018 2:20 PM

మాజీ సీఎంను పిలిపించిన మోదీ? - Sakshi

మాజీ సీఎంను పిలిపించిన మోదీ?

సూరత్ లో బీజీపీ ర్యాలీ విఫలం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీవాకబు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని సూరత్ లో బీజీపీ ర్యాలీ విఫలం కావడంపై ఆయన వాకబు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ ను ఢిల్లీకి పిలిచినట్లు సమాచారం. శనివారం ఆనందీ బెన్ పటేల్ హుటాహుటిన ఢిల్లీ వెళ్లడానికి ఇదే కారణమని తెలిసింది.

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు ఆనందీ కూడా గురువారం జరిగిన ర్యాలీలో పాల్గొన్న విషయం తెలిసిందే. పాటీదార్లలో తమకు ఉన్న బలనిరూపణ కోసం చేపట్టిన ర్యాలీని పాటీదార్లే అడ్డగించడంతో బీజేపీ కంగు తింది. దీంతో నష్టనివారణ చర్యల కోసమే ఆనందీ బెన్ ను ఢిల్లీకి పిలిపించారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. మోదీ గుజరాత్ ను పాలించిన 12 ఏళ్ల కాలంలో ఆనందీ బెన్ పటేల్, అమిత్ షా ఆయనకు సన్నిహితులు. 2014 ఎన్నికల తర్వాత గుజరాత్ బాధ్యతలను ఆనందీ బెన్ కు, అమిత్ షాకు పార్టీ అధ్యక్ష పదవిని అప్పగించడానికి కూడా ఇదే ప్రధాన కారణం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement