‘నమస్తే ట్రంప్‌’తోనే వైరస్‌ వ్యాప్తి : శివసేన

Namaste Trump event responsible for coronavirus India - Sakshi

సాక్షి, ముంబై : భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తిపై శివసేన తీవ్ర ఆరోపణలు చేసింది. దేశంలో కరోనా విజృంభణకు గుజరాత్‌లో నిర్వహించిన ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమం కారణమంటూ సామ్నా ఎడిటోరియల్‌ వేదికగా శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో నిర్వహించిన నమస్తే ట్రంప్‌ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షడు డోనాల్డ్‌ ట్రంప్‌తో పాటు పలువురు అమెరికా ప్రతినిధులు హాజరైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దాదాపు లక్షమందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. ఫిబ్రవరి 24న జరిగిన ఈ కార్యక్రమంతోనే దేశంలో కరోనా వ్యాప్తి మరింత పెరిగిందని రౌత్‌ ఆరోపించారు. (ఒక్క రోజే 8,380 కరోనా కేసులు)

గుజరాత్‌తో పాటు ముంబై, ఢిల్లీల్లో అమెరికా ప్రతినిధులు పర్యటించారని, వారి మూలంగానే కోవిడ్‌ తీవ్ర రూపందాల్చిందని పేర్కొన్నారు. అప్పటికే చైనాతో పాటు అమెరికా, ఇటలీ, యూరప్‌ దేశాల్లో పెద్ద ఎత్తున కరోనా కేసులు వెలుగుచూశాయని, అయినప్పటికీ ప్రధాని మోదీ నమస్తే ట్రంప్‌ కార్యక్రమాన్ని వాయిదా వేయలేదని విమర్శించారు.  దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. (ఆక్సిజన్‌ లేక కోవిడ్‌ బాధితులు మృతి)

ఇక మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విజృంభణపై కూడా సామ్నా వేదికగా స్పందించారు. అత్యధిక జనసాంధ్రత కారణంగానే ముంబైలో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయని రౌత్‌ పేర్కొన్నారు. వైరస్‌ వ్యాప్తిని సాకుగా చూపించి రాష్ట్రంలో రాష్ట్రపతి విధించాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్‌ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మహారాష్ట్రలోనే కాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లోనూ వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎక్కువగానే ఉందని గుర్తుచేశారు. ఇక కరోనా వ్యాప్తి నియంత్రణకు కేంద్ర విధించిన లాక్‌డౌన్‌ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

02-07-2020
Jul 02, 2020, 21:11 IST
బీజింగ్‌: మందు లేని మాయ‌రోగం వ‌చ్చిందంటే ఎవ‌రు మాత్రం భ‌య‌ప‌డిపోరు? పైగా అది భ‌యంక‌ర‌ అంటువ్యాధి అని తెలిస్తే ఇంకేమైనా ఉందా?...
02-07-2020
Jul 02, 2020, 19:30 IST
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిని నిరోధించడంలో కీలకమైన కోవిడ్‌-19 పరీక్షలను పెద్దసంఖ్యలో చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. త్వరలోనే దేశవ్యాప్తంగా కరోనా...
02-07-2020
Jul 02, 2020, 16:18 IST
లండ‌న్ : మ‌న‌లో చాలామందికి కోవిడ్ వ్యాక్సిన్ అవ‌స‌రం ఉండ‌క‌పోవ‌చ్చ‌ని, వైర‌స్ దానంత‌ట అదే స‌హ‌జంగా స‌మసిపోతుంద‌ని ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటి ఫ్రొఫెస‌ర్,...
02-07-2020
Jul 02, 2020, 15:24 IST
సాక్షి, గుంటూరు: కరోనా వచ్చిందని కన్నతల్లిని కుమారుడు బస్టాండులో వదిలేసిన ఘటన గురువారం మాచర్లలో చోటు చేసుకుంది. పాల్వని(70) కొన్ని సంవత్సరాలుగా...
02-07-2020
Jul 02, 2020, 14:50 IST
ఢిల్లీ : బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్ మరోసారి వార్తల్లో నిలిచారు. కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న...
02-07-2020
Jul 02, 2020, 14:44 IST
న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా అంతకంతకు విస్తరిస్తోంది. ఈ మాయదారి రోగానికి వ్యాక్సిన్‌ కనుక్కోవడానికి మరి కొంత సమయం పడుతుంది. ఈ...
02-07-2020
Jul 02, 2020, 14:41 IST
జెనీవా: ఈ ఏడాది ద్వితీయార్థంలో మరోసారి కోవిడ్‌–19 విజృంభిస్తే ప్రపంచవ్యాప్తంగా11.9 శాతం పనిగంటలను కోల్పోవాల్సి వస్తుందని, ఇది 34 కోట్ల...
02-07-2020
Jul 02, 2020, 14:39 IST
సాక్షి, ముంబై: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో  వైద్య సిబ్బందికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో ముందు...
02-07-2020
Jul 02, 2020, 14:18 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 14,285 సాంపిల్స్‌ను పరీక్షించగా.. 845 మంది...
02-07-2020
Jul 02, 2020, 14:05 IST
కోల్‌క‌తా: క‌రోనాతో చ‌నిపోయిన వ్య‌క్తి శ‌వాన్ని ఎదురుగా ఉంచుకుని ఓ కుటుంబం రెండు రోజుల పాటు న‌ర‌క‌యాత‌న అనుభ‌వించింది. ఈ...
02-07-2020
Jul 02, 2020, 13:28 IST
న్యూఢిల్లీ:  కేవలం ఒక్క నెల.. 30 రోజులు.. 3,94,958 మంది బాధితులు. దేశంలో జూన్‌ నెలలో కరోనా ఉధృతికి నిదర్శనం...
02-07-2020
Jul 02, 2020, 13:26 IST
వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా ప్రజలను కరోనా మహమ్మారి వెంటాడుతోంది. రోజురోజుకు అక్కడ కరోనా వైరస్‌ కోరలు చాస్తోంది. ఇప్పటికే కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాలలో మొదటి స్థానంలో...
02-07-2020
Jul 02, 2020, 12:13 IST
సాక్షి, ముంబై: కరోనా వైరస్ సంక్షోభ సమయంలో అమెజాన్ చేతివృత్తులు, చిన్న, మహిళా వ్యాపారులకు మరోసారి భారీ ఊరట కల్పించింది. ఎస్ఓఏ (సేల్ ఆన్ అమెజాన్) ఫీజును తాజాగా...
02-07-2020
Jul 02, 2020, 11:39 IST
సాక్షి, హైదరాబాద్‌: మహమ్మారిపై పోరు ముమ్మరమవుతోంది. కోవిడ్‌ కట్టడికి లాక్‌డౌన్‌ పాటించి ప్రజలు సామాజిక స్ఫూర్తిని చాటారు. ఇప్పుడు కోవిడ్‌...
02-07-2020
Jul 02, 2020, 11:36 IST
సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో గుండె జబ్బులు కూడా పెరుగుతున్నాయి. వాస్తవానికి ఈ సమస్య కోవిడ్‌–19 పరీక్షల్లో...
02-07-2020
Jul 02, 2020, 11:32 IST
పాఠశాలలు పునఃప్రారంభించేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ విద్యాశాఖ స్ప ష్టం చేసింది.
02-07-2020
Jul 02, 2020, 11:25 IST
సాక్షి, హైదరాబాద్‌: సౌకర్యాలు లేక కరోనా నిర్ధారణ పరీక్షలు నిలిపివేస్తున్నామన్న ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు ప్రకటనపై హైకోర్టు...
02-07-2020
Jul 02, 2020, 11:03 IST
లండన్‌ : ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. క్రికెట్‌ సహా అన్ని రకాల ఆటలు స్తంభించిపోయాయి. ఇప్పుడిప్పుడే క్రీడలు...
02-07-2020
Jul 02, 2020, 11:02 IST
జైపూర్‌: కరోనా కష్టకాలంలో పెళ్ళిళ్ళు చేస్తున్నారా? అయితే పెళ్ళి ఖర్చుతో పాటు కోవిడ్‌ ఖర్చుని కూడా లెక్కేసుకోవాలి సుమా! రాజస్తాన్‌లోని...
02-07-2020
Jul 02, 2020, 10:55 IST
మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తారనే వార్తల నేపథ్యంలో ఏపీకి వచ్చిన హైదరాబాదీలు తిరుగు ప్రయాణమవుతున్నారు.
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top