నేడు నీట్‌పై నడ్డా కీలక భేటీ | Nadda key meeting on NEET today | Sakshi
Sakshi News home page

నేడు నీట్‌పై నడ్డా కీలక భేటీ

May 16 2016 1:32 AM | Updated on Sep 2 2018 5:24 PM

జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) నిర్వహణను పలువురు పార్లమెంటేరియన్లు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా సోమవారం రాష్ట్రాల వైద్య, ఆరోగ్య మంత్రులతో సమావేశం కానున్నారు.

న్యూఢిల్లీ: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) నిర్వహణను పలువురు పార్లమెంటేరియన్లు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా సోమవారం రాష్ట్రాల వైద్య, ఆరోగ్య మంత్రులతో సమావేశం కానున్నారు. ‘వైద్యవిద్యలో ప్రవేశం కోసం ఎదురుచూస్తున్న లక్షలమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఈ భేటీతో పరిష్కారం వస్తుందని భావిస్తున్న’ట్లు నడ్డా ట్వీట్ చేశారు.

రెండు విడతల్లో నీట్ జరపాలన్న సుప్రీంకోర్టు ఆదేశం నేపథ్యంలో విపక్షాలతోపాటు పలు రాష్ట్ర ప్రభుత్వాల అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని.. కేంద్రం ఈ భేటీ తలపెట్టింది. వివిధ ప్రాంతీయ భాషల్లో 12వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు నీట్‌లో పోటీ పడటం కష్టమవుతుందని పలు రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీం కోర్టుకు వెల్లడించాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement