
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అమలుచేసి తీరాలని వైఎస్సార్‌సీపీ మరోసారి కేంద్రాన్ని డిమాండ్ చేసింది
రాజధాని కూడా లేదని ఎంపీ వెలగపల్లి ఆవేదన
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అమలుచేసి తీరాలని వైఎస్సార్‌సీపీ మరోసారి కేంద్రాన్ని డిమాండ్ చేసింది. బుధవారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై మరోసారి నొక్కిచెప్పారు. ‘స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని మేం మళ్లీ మళ్లీ అడుగుతూనే ఉన్నాం.
మా పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దీనిపై ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. మాకు రాజధాని లేదు. కేంద్రం మమ్మల్ని ఆదుకోవాలి’ అని విన్నవించారు. తాజా బడ్జెట్ గ్రామీణ భారతంపై దృష్టిపెట్టినందుకు ధన్యవాదాలన్నారు. ప్రత్యక్ష బదిలీ పథకం, ఎల్పీజీ వదులుకోండి పథకం, ప్రధాని పంటల బీమా పథకం, గంగా శుద్ధి పథకం బాగున్నాయనీ అయితే ప్రజల్లో అనేక విషయాల్లో అనుమానాలున్నాయన్నారు.