ఎయిర్‌పోర్టు రన్‌వే.. తిరిగి ప్రారంభం | Mumbai Airport Runway Reopens And Functional | Sakshi
Sakshi News home page

ముంబై ఎయిర్‌పోర్టు రన్‌వే తిరిగి ప్రారంభం

Jul 5 2019 8:35 PM | Updated on Jul 5 2019 10:14 PM

Mumbai Airport Runway Reopens And Functional - Sakshi

ముంబై: రన్‌వేపై విమానం కూలిపోవడంతో గత కొద్ది రోజులుగా నిలిపివేసిన ఎయిర్‌పోర్టు రన్‌వేను తిరిగి ప్రారంభిస్తున్నట్టు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ప్రకటించింది. రన్‌వే పూర్తి స్థాయిలో శుక్రవారం 4.47 గంటల నుంచి అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. స్పైస్‌ జెట్‌ విమానం జూలై 2న రన్‌వేపై కూలీపోవడంతో విమాన రాకపోకలను ఈ రన్‌వే గుండా నిలిపివేసిన సంగతి తెలిసిందే. దాంతో 60 మందితో కూడిన బృందం 90 గంటల పాటు ఈ రన్‌వేను రిపేర్‌ చేసి అందుబాటులోకి తీసుకువచ్చారు.

అందులో భాగంగా దాదాపు 41 టన్నులు ఉన్న ఈ విమానాన్ని రన్‌వే నుంచి పక్కకు లాగారు. ఆ విమానంలో ఉన్న ఇందనం, సరుకులను ఖాళీ చేసి రన్‌వే నుంచి తొలగించారు. ఒక వైపు వర్షం పడుతుంటే.. ఆ విమానం గేర్‌ లభించకపోవడంతో తీవ్రం శ్రమించి దాన్ని పోక్లైన్  సాయంతో రన్‌వే నుంచి పక్కకు లాగారు. ఈ క్రమంలో ముంబై అంతర్జాతీయ విమానాశ్రమం లిమిటెడ్‌ రన్‌వేను తిరిగి ప్రారంభించనున్నట్టు పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement