
న్యూఢిల్లీ : విదేశాల నుంచి భారత్‌కు చేరుకునేవారికి సంబంధించి కేంద్ర ఆరోగ్యశాఖ కీలక మార్గదర్శకాలు జారీచేసింది. విదేశాల నుంచి భారత్‌లో అడుగుపెట్టేవారు 14 రోజులు కచ్చితంగా క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. విదేశాల నుంచి వచ్చేవారు తొలి ఏడు రోజుల పాటు సొంత ఖర్చులతో ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్‌లో, మరో ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించింది.
కాగా, కేంద్ర ప్రభుత్వం విదేశాల్లో ఉన్న భారతీయులను తరలించేందుకు వందే భారత్ మిషన్ కింద ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు సోమవారం నుంచి దేశీయ విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్టు కేంద్రం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. (చదవండి : ఆగస్టులోగా అంతర్జాతీయ విమానాలు!)