బ్లాక్‌లిస్టులో 82 మెడికల్‌ కాలేజీలు..

Medical Council of India Blacklists 82 Medical Colleges For This Academic Year - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  2018-19 విద్యా సంవత్సరానికి గానూ 82 వైద్య కళాశాలల ప్రవేశానుమతులపై నిషేధం విధించాల్సిందిగా జాతీయ వైద్య మండలి(ఎమ్‌సీఐ)... కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. ఈ విషయంపై స్పందించిన సంబంధిత శాఖ ప్రభుత్వాధికారి మాట్లాడుతూ.. వివిధ వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, బోధనా సిబ్బంది, ఇతర వనరులు తదితర అంశాల ఆధారంగా ఎమ్‌సీఐ తనిఖీలు నిర్వహించిందన్నారు. తనిఖీల్లో భాగంగా సంబంధిత అంశాల్లో పలు లోపాలు ఉన్నట్లు గుర్తించిన ఎమ్‌సీఐ ఆయా కళాశాలలను బ్లాక్‌ లిస్టులో చేర్చాల్సిందిగా సూచించిందని తెలిపారు. ఈ మేరకు 2018- 19 సంవత్సరానికి గానూ ప్రవేశాలు నిషేధించాల్సిందిగా సిఫారసు చేసిందన్నారు.

బ్లాక్‌లిస్టులోని 82 మెడికల్‌ కాలేజీల్లో 70 ప్రైవేట్‌, 12 ప్రభుత్వ కళాశాలలు ఉన్నట్లు తెలిపారు. ఈ కళాశాలలపై నిషేధం విధించడం ద్వారా అందుబాటులో ఉన్న 64 వేల సీట్లలో సుమారు 10వేల సీట్లు విద్యార్థులు కోల్పోవాల్సి వస్తుందన్నారు. అంతేకాకుండా కొత్తగా 31 ప్రభుత్వ, 37 ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలకు అనుమతించాల్సిందిగా వచ్చిన ప్రతిపాదనలు కూడా ప్రస్తుతానికి తిరస్కరించినట్లు తెలిపారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 2021-22 నాటికి కొత్తగా 24 ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top