సీడీఎస్‌ గరిష్ట వయో పరిమితి 65 ఏళ్లు

Maximum age limit for Chief of Defence Staff put at 65 - Sakshi

న్యూఢిల్లీ: రక్షణ బలగాల అధిపతి(సీడీఎస్‌) బాధ్యతలు చేపట్టే వ్యక్తి గరిష్ట వయో పరిమితిని కేంద్రం 65 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు సైనిక, నేవీ, వైమానిక దళం నిబంధనలు–1954లో మార్పులు చేస్తూ రక్షణ శాఖ ఆదివారం నోటిఫికేషన్‌ వెలువరించింది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ అధిపతులను నియమించిన సందర్భాల్లో ఈ నిబంధన వర్తిస్తుంది. త్రివిధ దళాలకు సంబంధించిన అన్ని అంశాలపై రక్షణ మంత్రికి ప్రధాన సలహాదారుగా సీడీఎస్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కేబినెట్‌ భేటీ ఇటీవల ఆమోదించిన విషయం తెలిసిందే.  ప్రస్తుత నిబంధనల ప్రకారం త్రివిధ దళాల అధిపతులు గరిష్టంగా మూడేళ్లపాటు, లేదా 62 ఏళ్ల వయస్సు వచ్చే వరకు బాధ్యతల్లో కొనసాగుతారు. కాగా, దేశ మొట్టమొదటి సీడీఎస్‌గా ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ను ప్రభుత్వం మంగళవారం ప్రకటించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.కాగా, సీడీఎస్‌గా చేపట్టే వ్యక్తే చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ కమిటీ చైర్‌ పర్సన్‌గానూ కొనసాగుతారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top