breaking news
Combined Defence Services Exam
-
సీడీఎస్ గరిష్ట వయో పరిమితి 65 ఏళ్లు
న్యూఢిల్లీ: రక్షణ బలగాల అధిపతి(సీడీఎస్) బాధ్యతలు చేపట్టే వ్యక్తి గరిష్ట వయో పరిమితిని కేంద్రం 65 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు సైనిక, నేవీ, వైమానిక దళం నిబంధనలు–1954లో మార్పులు చేస్తూ రక్షణ శాఖ ఆదివారం నోటిఫికేషన్ వెలువరించింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధిపతులను నియమించిన సందర్భాల్లో ఈ నిబంధన వర్తిస్తుంది. త్రివిధ దళాలకు సంబంధించిన అన్ని అంశాలపై రక్షణ మంత్రికి ప్రధాన సలహాదారుగా సీడీఎస్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కేబినెట్ భేటీ ఇటీవల ఆమోదించిన విషయం తెలిసిందే. ప్రస్తుత నిబంధనల ప్రకారం త్రివిధ దళాల అధిపతులు గరిష్టంగా మూడేళ్లపాటు, లేదా 62 ఏళ్ల వయస్సు వచ్చే వరకు బాధ్యతల్లో కొనసాగుతారు. కాగా, దేశ మొట్టమొదటి సీడీఎస్‌గా ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్‌ను ప్రభుత్వం మంగళవారం ప్రకటించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.కాగా, సీడీఎస్‌గా చేపట్టే వ్యక్తే చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్ పర్సన్‌గానూ కొనసాగుతారు. -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్- (2) పరీక్షలో జనరల్ నాలెడ్జ్ నుంచి ఎన్ని మార్కులకు ప్రశ్నలు వస్తాయి? ఏయే అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు? - యు.జయశ్రీ, రహ్మత్‌నగర్ ఇండియన్ మిలిటరీ అకాడెమీ, ఇండియన్ నేవల్ అకాడెమీ, ఎయిర్‌ఫోర్స్ అకాడెమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీల్లో ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి ప్రతి ఏటా రెండుసార్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్షను నిర్వహిస్తోంది. ఇందులో జనరల్ నాలెడ్జ్ నుంచి 100 మార్కులకు ప్రశ్నలడుగుతారు. మల్టిపుల్ చాయిస్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. రెండు గంటల వ్యవధిలో సమాధానాలు గుర్తించాలి. వీటికి సమాధానాలు గుర్తించడానికి ఏ సబ్జెక్టులోనూ ప్రత్యేక ప్రావీణ్యం అవసరం లేదు. వర్తమాన వ్యవహారాల కోసం ప్రతిరోజూ ప్రామాణిక దినపత్రిక చదవాలి. స్టాక్ జీకే కోసం ఏదైనా జనరల్ నాలెడ్జ్ పుస్తకం చదివితే సరిపోతుంది. పరిసరాలపై కాస్త అవగాహన ఉంటే జీకే ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడం తేలికే. సిలబస్‌లో నిర్దేశించిన భారతదేశ చరిత్ర, జాగ్రఫీ కోసం 8, 9, 10 తరగతుల సోషల్ పుస్తకాలు చదువుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధిత అంశాలు, ఆవిష్కరణల కోసం ఏదైనా ఇయర్ బుక్‌లోని కరెంట్ అఫైర్స్ సెక్షన్‌ను ఔపోసన పట్టాలి. అభ్యర్థులు ముందుగా సిలబస్‌పై పూర్తి అవగాహనకు రావాలి. సిలబస్ ఆధారంగా స్పష్టమైన లే అవుట్ రూపొందించుకోవాలి. తప్పుగా గుర్తించిన ప్రశ్నలకు నెగెటివ్ మార్కులు ఉంటాయి కాబట్టి తెలియని వాటిని వదిలేయడమే మంచిది. మార్కెట్లో జనరల్ నాలెడ్జ్ కోసం ఎన్నో పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. అన్నింటినీ కొని చదవకుండా ప్రామాణికమైన పుస్తకాలను ఎంచుకోవాలి. 8, 9,10 తరగతుల సైన్స్, సోషల్ పుస్తకాలు తిరగేస్తే 50 శాతం మార్కులు ఖాయమైనట్లే. ప్రిపరేషన్ పూర్తై తర్వాత పాత ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. ప్రశ్నల సరళి, ఏయే అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయో పరిశీలించాలి. అందుకనుగుణంగా ప్రిపరేషన్ ఉండాలి. ఈ ఏడాది సీడీఎస్ (1) ఎగ్జామ్‌లో అడిగిన కొన్ని ప్రశ్నలు: 1. నవంబర్ 8, 2013లో ఫిలిప్ఫీన్స్‌లో టైపూన్ సంభవించి చాలామంది ప్రజలు మరణించారు. అయితే ఆ టైపూన్ పేరేమిటి? ఎ) హయాన్ బి) ఉటార్ సి) ఫైలిన్ డి) నెసాత్ 2. ఏ గుప్త చక్రవర్తి పరిపాలిస్తున్న కాలంలో నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు? ఎ) కుమార గుప్త -2 బి) కుమార గుప్త - 1 సి) చంద్ర గుప్త -2 డి) సముద్ర గుప్త ఇన్పుట్స్: ఎన్.విజయేందర్‌రెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ