ఇన్‌ఫార్మర్ నెపంతో ముగ్గురి హత్య | maoists kill 3 persons due to suspect of informers | Sakshi
Sakshi News home page

ఇన్‌ఫార్మర్ నెపంతో ముగ్గురి హత్య

Apr 6 2016 10:41 PM | Updated on Oct 9 2018 2:51 PM

పోలీసులకు ఇన్‌ఫార్మర్ గా చేస్తున్నాడనే అనుమానంతో మావోయిస్టులు ముగ్గురు గ్రామస్తులను కాల్చి చంపారు.

రాయ్‌పూర్: పోలీసులకు ఇన్‌ఫార్మర్ గా చేస్తున్నాడనే అనుమానంతో మావోయిస్టులు ముగ్గురు గ్రామస్తులను కాల్చి చంపారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ఏరియాలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కొండగాన్ జిల్లాలో ఇద్దర్ని, కంకెర్ జిల్లాలో ఒకరిని హత్య చేశారు. వీరిలో ఇద్దరు కూడుర్ గ్రామానికి చెందిన బుద్రు, మంకుగా పోలీసులు గుర్తించారు. లలిత్ దుగ్గ అనే వ్యక్తిని తమకు మద్దతుగా పనిచేయలేదని క్రూరంగా కొట్టి చంపారని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement