పదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు.. 

Mangalore Plane Crash Happened 10 Years Ago - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పది సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు మంగళూరు ఏయిర్‌పోర్టులో ఓ విమాన ప్రమాదం చోటుచేసుకుంది. దుబాయ్‌నుంచి ఇండియాకు వచ్చిన ఏయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ఫ్లైట్‌ వన్‌ఎక్స్‌ 812 ఎయిర్‌పోర్టులో దిగుతూ ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం 166 మంది ఉండగా.. 158 మంది మృత్యువాత పడ్డారు. విమానంలో నుంచి కిందకు దూకి ఓ ఎనిమిది మంది ప్రాణాలు కాపాడుకున్నారు. విమానం రెండుగా బద్ధలవటానికి ముందే వారు కిందకు దూకటం మంచిదైంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారంతా భారతీయులు కావటం గమనార్హం. ( విమాన ప్రమాదం: ఆయనొక్కరే అదృష్టవంతుడు?)

పాకిస్తాన్‌ విమాన ప్రమాద దృశ్యాలు

విమాన ప్రమాదంలో మరణించిన వారికి గుర్తుగా మంగళూరులోని పనబారం పోర్టులో ఓ మెమోరియల్‌ను నిర్మించారు. ఈ ఉదయం మృతులకు నివాళులు అర్పించే కార్యక్రమం కూడా జరిగింది. నివాళుల కార్యక్రమం ముగిసిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్‌ ఇంటర్‌నేషనల్‌ ఫ్లైట్‌ ప్రమాదానికి గురైంది. దాదాపు 100 మంది ప్రయాణికులతో వెళుతున్న ఎయిర్ బస్ 320 కరాచీ ఏయిర్‌పోర్టు వద్ద కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఎవ్వరూ ప్రాణాలతో బయటపడలేదని తెలుస్తోంది. ( కుప్పకూలిన విమానం : 100 మంది..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top