సీఎం కార్యాలయం బయట వ్యక్తి ఆందోళన

Man Shouts Outside BS Yediyurappa House - Sakshi

బెంగళూరు: దేశంలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ క్రమంలో పాజిటివ్‌ వచ్చిన ఓ వ్యక్తికి ఆస్పత్రిలో బెడ్‌ కేటాయించలేదు వైద్యులు. ఇదేంటని ప్రశ్నిస్తే.. బెడ్స్‌ ఖాళీగా లేవని సమాధానమిచ్చారు. దాంతో ఆ వ‍్యక్తి ఏకంగా ముఖ్యమంత్రి నివాసం దగ్గరకి వెళ్లి హల్‌చల్‌ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరలవుతోంది. వివరాలు.. ఈ వీడియోలో ఓ వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప ఇంటి‌ బయట నిల్చున్నాడు. ‘నాకు ఆరోగ్యం బాగాలేదు.. నా కుమారుడికి కూడా జ్వరం వస్తోంది. నాకు కరోనా పాజిటివ్‌ అని వైద్యులకు తెలిపాను. అయినా నాకు బెడ్‌ కేటాయించలేదు. సీఎం గారు సాయం చేయండి’ అంటూ అరిచాడు. (ఆక్సిజన్‌ అందకే నా భర్త మృతి చెందాడు)

దీని గురించి యడియూరప్ప సన్నిహితులను ప్రశ్నించగా.. వారు ఖండించారు. అంతేకాక సదరు వ్యక్తి ఆస్పత్రికి వెళ్లకుండా సరాసరి ముఖ్యమంత్రి ఇంటి దగ్గరకు వచ్చినట్లు తెలిపారు. వైద్యానికి డబ్బులు లేకపోవడంతోనే అతడు ఇలా చేశాడన్నారు. అనంతరం అంబులెన్స్‌లో ఆ కుటుంబాన్ని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. కర్ణాటకలో కరోనా కేసులు రోజుకురోజుకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో బెంగళూరు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. పెరుగుతున్న కేసులకు సరిపడా ఆస్పత్రుల్లో బెడ్స్‌ అందుబాటులో లేవు. దీనిపై గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది.(‘కరోనా నుంచి దేవుడే మనల్ని కాపాడాలి’

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top