భార్యను కత్తెరతో పొడిచి చంపి అనంతరం భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తూర్పు ఢిల్లీలోని గాంధీ నగర్ ప్రాంతంలో శనివారం వెలుగుచూసింది.
న్యూఢిల్లీ: భార్యను కత్తెరతో పొడిచి చంపి అనంతరం భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తూర్పు ఢిల్లీలోని గాంధీ నగర్ ప్రాంతంలో శనివారం వెలుగుచూసింది. పూజ అనే తన భార్యను నీరజ్ అనే భర్త పలుమార్లు కత్తెరతో పొడిచి అతి దారుణంగా చంపాడు. భార్యను చంపిన అనంతరం కదిలే రైళ్లో నుంచి దూకి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు రక్తపు మడుగులో పడిఉన్న పూజ మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో గోడపై రక్తంతో రాసిన ఓ సందేశాన్ని కూడా పోలీసులు గుర్తించారు.
''నా భార్యను చంపాను, నేను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాను' అంటూ గోడపై రక్తంతో రాసినట్టు పోలీసులు గుర్తించారు. తన ఆత్మహత్యకు భార్య పూజ, ఆమె కుటుంబమే కారణమంటూ రాసి ఉందని పోలీసులు తెలిపారు. శనివారం ఉదయం రైల్వే ట్రాక్ వద్ద భర్త నీరజ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.