పార్లమెంటు సమీపంలో వ్యక్తి ఆత్మహత్య | Man Found Hanging Near Parliament, 30-Page Suicide Note Found | Sakshi
Sakshi News home page

పార్లమెంటు సమీపంలో వ్యక్తి ఆత్మహత్య

May 12 2016 11:04 AM | Updated on Nov 6 2018 8:22 PM

దేశ రాజధాని నడిబొడ్డున పార్లమెంటుకు కూత వేటు దూరంలో, ప్రభుత్వ కార్యాలయాలకు సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకుని ఒక వ్యక్తి మరణించాడు.

న్యూఢిల్లీ:  దేశ రాజధాని నడిబొడ్డున పార్లమెంటుకు కూత వేటు దూరంలో ఓ వ్యక్తి  చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పార్లమెంట్ పార్కింగ్ కాంప్లెక్స్ సమీపంలోని ఓ చెట్టుకు వేళాడుతున్న వ్యక్తి మృతదేహాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు మధ్యప్రదేశ్ లోని శివపూర్ కు చెందిన రామ్ దయాళ్ వర్మ(39)గా పోలీసులు గుర్తించారు.
 
మృతుడి జేబులోని సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. అప్పులు భారంతోనే రామ్ దయాళ్ వర్మ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అత్యంత భద్రత కల్గిన విజయ్ చౌక్ లో రాష్ట్రపతి నివాసానికి దగ్గర్లో ఈ ఘటన జరిగింది. మృతుడి కుటుంబానికి సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement