ప్రాణం తీసిన సెల్ఫీ.. | Man fatally hit by train while clicking selfie | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన సెల్ఫీ..

Mar 6 2017 5:04 PM | Updated on Sep 5 2017 5:21 AM

ఓ యువకుడు వేగంగా వస్తున్న రైలు ముందు నిల్చోని సెల్ఫీ దిగుతూ ప్రాణాలు కోల్పోయాడు.

పనాజి: సెల్ఫీ మోజు ఓ యువకుడి ప్రాణం తీసింది. వేగంగా వస్తున్న రైలు ముందు నిల్చోని సెల్ఫీ దిగుతుండగా రైలు ఢీ కొట్టడంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఆదివారం పనాజిలోని కర్మాలీ రైల్వే స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.
 
సచిన్‌ కుందేకర్‌ (25), అతని మిత్రుడితో దోజి గ్రామంలోని రైల్వే ట్రాక్‌పై నిల్చోని సరదాగా సెల్ఫీ దిగుతుండగా వేగంగా వస్తున్న రైలు ఢీకొట్టింది. అతని మిత్రుడు సమాచారంతో వెంటనే ఆసుపత్రికి తరలించామని, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని కొంకణ్‌ రైల్వే ఇన్‌స్పెక్టర్‌ సోమవారం మీడియాకు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement