మహిళా ఎమ్మెల్యేలు 16 మందే! | Maharashtra assembly polls: Only 16 women won | Sakshi
Sakshi News home page

మహిళా ఎమ్మెల్యేలు 16 మందే!

Oct 21 2014 3:31 AM | Updated on Oct 8 2018 6:02 PM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహిళలకు సరైన వాటా దక్కలేదు. మొత్తం 16 మంది మహిళలు మాత్రమే గెలిచారు.

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహిళలకు సరైన వాటా దక్కలేదు. మొత్తం 16 మంది మహిళలు మాత్రమే గెలిచారు. వీరిలో బీజేపీ నుంచి 10 మంది, కాంగ్రెస్ నుంచి ఐదుగురు, ఎన్సీపీ నుంచి ఒకరు ఉన్నారు. శివసేన, ఎమ్మెన్నెస్‌లకు మహిళా ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం లేదు. బీజేపీకి చెందిన ఆ పార్టీ దివంగత నేత గోపీనాథ్ ముండే కుమార్తె పంకజ, మరో సిట్టింగ్ ఎమ్మెల్యే  మధుశ్రీ మిసాల్‌లు తమ సీట్లలో తిరిగి గెలిచారు. కొత్తగా ఎన్నికైన మహిళా ఎమ్మెల్యేల్లో మాజీ సీఎం అశోక్ చవాన్ భార్య అమీతా చవాన్ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement