చెన్నపట్నానికి 375 ఏళ్లు | Madras Day: Celebrating 375 years of glory | Sakshi
Sakshi News home page

చెన్నపట్నానికి 375 ఏళ్లు

Aug 23 2014 2:06 AM | Updated on Sep 2 2017 12:17 PM

చెన్నపట్నానికి 375 ఏళ్లు

చెన్నపట్నానికి 375 ఏళ్లు

దక్షిణాదిలోని నగరాల్లోకెల్లా ప్రముఖ పారిశ్రామిక, వ్యాపార, సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లుతున్న తమిళనాడు రాజధాని చెన్నై శుక్రవారంతో 375వ వసంతంలోకి అడుగుపెట్టింది.

చెన్నై: దక్షిణాదిలోని నగరాల్లోకెల్లా ప్రముఖ పారిశ్రామిక, వ్యాపార, సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లుతున్న తమిళనాడు రాజధాని చెన్నై శుక్రవారంతో 375వ వసంతంలోకి అడుగుపెట్టింది. 1639 ఆగస్టు 22న ఈ నగరం ఏర్పడింది. ఈ ప్రాంతాన్ని తమకు అప్పగించేలా నాటి రాజులతో బ్రిటీషర్లు ఒప్పందం కుదుర్చుకోవడంతో నాటి మద్రాస్ ఆవిర్భవించింది. ఆ తర్వాతి ఏడాదే...అంటే 1640లో బ్రిటీషర్లు ఇక్కడ సెయింట్ జార్జి కోటను నిర్మించి తమ ఈస్ట్ ఇండియా కార్యకలాపాలకు ఉపయోగించుకున్నారు. నాటి నుంచి నేటి వరకూ ఈ ప్రాంతం అంచెలంచెలుగా ఎదిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మద్రాస్ డే పేరిట  శుక్రవారం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నగరానికి సంబంధించి పలు విశేషాలు...

ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రగరి కోటలో మద్రాస్‌ను బ్రిటీషు పాలకులకు అప్పగించే ఒప్పందం కుదిరింది.
మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో 1917లో మద్రాస్‌పై ఎండెన్ అనే జర్మనీ నౌక బాంబుల వర్షం కురిపించింది.
ఆధునిక భారత్‌లోని తొలి నగరం ఇదే. కోల్‌కతాకన్నా 50ఏళ్ల తర్వాత, ముంబైకన్నా 35 ఏళ్ల తర్వాత మద్రాస్ అభివృద్ధి చెందింది.
నేటి చెన్నై నగరాన్ని మొట్టమొదట చెన్నప్పనాయకన్ అని పిలిచేవారట. ఆ తర్వాతి కాలంలో అదే చెన్నపట్నంగా, మద్రాస్‌గా మారి చివరకు చెన్నైగా స్థిరపడింది.
1996లో నాటి డీఎంకే సర్కారు ఈ నగరం పేరును మద్రాస్ నుంచి చెన్నైగా మార్చారు.
{పపంచంలోనే రెండో అతిపొడవైన మెరీనా బీచ్ చెన్నైలోనే ఉంది.
బాలీవుడ్‌కు దీటుగా తమిళ సినీపరిశ్రమ వేళ్లూనుకుంది ఇక్కడే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement