డ్రైవర్‌ అక్కర్లేని సోలార్‌ బస్‌

LPU Students Designed And Built Solar Powered Driverless Bus - Sakshi

ఎల్‌పీయూ విద్యార్థుల ఘనత

సాక్షి, హైదరాబాద్‌: లవ్‌లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ(ఎల్‌పీయూ) విద్యార్థులు దేశంలోనే తొలి డ్రైవర్‌ రహిత, సౌరశక్తితో నడిచే బస్‌కు రూపకల్పన చేశారు. వర్సిటీలో జనవరి 3 నుంచి జరిగే జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ బస్సు లో తొలిసారిగా ప్రయాణిస్తారని యూనివర్సిటీ చాన్స్‌లర్‌ అశోక్‌ మిట్టల్‌ తెలిపారు. త్వరలోనే ఈ బస్‌ను వాణిజ్య వినియోగంలోకి కూడా తెస్తామ న్నారు. దీన్ని రూపొందించేందుకు విద్యార్థులు ప్రత్యేకంగా వెహికల్‌ టు వెహికల్‌ (విటువి) టెక్నాలజీని వినియోగించారని, దీనివల్ల అల్ట్రా సోనిక్, ఇన్‌ఫ్రారెడ్‌ సంకేతాల ఆధారంగా, జీపీఎస్, బ్లూటూత్‌ ద్వా రా నేవిగేషన్‌ ప్రక్రియ సాగు తుందని తెలిపారు. సౌరశక్తి, బ్యాటరీ ఇంజిన్‌తో నడిచే ఈ బస్‌ విలువ సాధారణ బస్‌లతో పోలిస్తే రూ.6 లక్షలు అధికమని పేర్కొన్నారు. బస్సు సామర్థ్యం ఆధారంగా 10 నుంచి 30 మంది వరకు ప్రయాణించవచ్చని, 30 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుందని వివరించారు. 
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top