మార్చి 1 నుంచి లాటరీలపై 28 శాతం జిఎస్టీ

Lotteries To Attract New GST Rate From March - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది మార్చి 1 నుంచి లాటరీలపై 28 శాతం జీఎస్టీ విధించనున్నారు. రాష్ట్రాలు నిర్వహిస్తున్న లేదా ఆధీకృత లాటారీలపై 28 శాతం శ్లాబ్‌లో ఏకరీతి పన్నును విధించాలని గత ఏడాది డిసెంబర్‌లో జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే లాటరీపై 12 శాతం పన్ను ఉండగా, రాష్ట్ర అధీకృత లాటరీపై 28 శాతం పన్ను విధిస్తున్నారు.

లాటరీలపై ఏకరీతి పన్ను ఉండాలనే డిమాండ్ల నేపథ్యంలో ఏర్పాటైన మంత్రుల బృందం సిఫార్సుతో లాటరీలపై 28 శాతం యూనిఫాం రేటుతో పన్ను విధించాలని గత ఏడాది డిసెంబర్‌లో జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయించింది. ఈ నిర్ణయానికి అనుగుణంగా మార్చి 1 నుంచి లాటరీలపై నూతన పన్ను విధానం అమల్లోకి వస్తుందని రెవెన్యూ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

చదవండి : ఇలా చేస్తే రూ. 1 కోటి దాకా నజరానా

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top