అబూసలేంకు జీవిత ఖైదు | life imprisionment to abusalem | Sakshi
Sakshi News home page

అబూసలేంకు జీవిత ఖైదు

Feb 25 2015 12:43 PM | Updated on Sep 2 2017 9:54 PM

అబూసలేంకు జీవిత ఖైదు

అబూసలేంకు జీవిత ఖైదు

గ్యాంగ్స్టర్ అబూసలేంకు జీవిత కారాగార శిక్ష పడింది. 1995నాటి బిల్డర్ ప్రదీప్ జైన్ హత్య కేసుకు సంబంధించి టాడా కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది.

మాఫీయా డాన్  అబూసలేంకు జీవిత కారాగార శిక్ష పడింది. 1995నాటి బిల్డర్ ప్రదీప్ జైన్ హత్య కేసుకు సంబంధించి బుధవారం టాడా కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. ప్రదీప్ అతడి సోదరుడు సునీల్తోపాటు పలువురు బిల్డర్లను సలేం బెదిరించి భయకంపనలు సృష్టించాడని కోర్టు నిర్ధారించింది. ఆస్తులపై హక్కులివ్వకపోతే కోటి రూపాయలు ఇవ్వాలని బెదిరించి ఒప్పందం చేసుకున్నారన్నారు. ప్రదీప్ తొలుత పది లక్షలు ఇచ్చారని, మిగిలిన మొత్తం ఇవ్వకపోవడంతో 1995, మార్చి 7న జుహూ బంగళా బయట జైన్‌ను తుపాకీతో కాల్చి చంపారని కోర్టు పేర్కొంది. ఈ కేసులో మరో ఇద్దరు కూడా దోషులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement