కుక్కపై పులి పంజా విసిరింది.. | Leopard and Her Cub Seconds Before Killing Pet Rottweiler in Thane | Sakshi
Sakshi News home page

కుక్కపై పులి పంజా విసిరింది..

Aug 12 2015 9:38 AM | Updated on Sep 2 2018 3:30 PM

కుక్కపై పులి పంజా విసిరింది.. - Sakshi

కుక్కపై పులి పంజా విసిరింది..

ఓ యజమాని పెంపుడు శునకాన్ని చిరుతపులి, దాని పసికూన కలిసి చంపేశాయి.

థానే:  ఓ పెంపుడు కుక్క... చిరుతపులి, దాని పసికూన చేతిలో దారుణంగా ప్రాణాలు కోల్పోయింది. ఇందులో విశేషం ఏముందనుకుంటున్నారా! ఇది జరిగింది ఏ అడవిలోనో.. పార్కులోనో కాదు.. జనావాసాల మధ్య ఉన్న ఓ ఇంట్లో జరిగిన  సంఘటన ఇది. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ సంఘటన రెండు రోజుల కిందట జరిగింది. తప్పిపోయిన పెంపుడు కుక్క.. కోకో గురించి ఇంటి యజమాని  ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది.

 

సంజయ్ గాంధీ జాతీయ పార్కు నుంచి ఓ చిరుత ...తన పసికూనలో సహా తప్పించుకుని సమీపంలోని ఓ ఇంట్లోకి ప్రవేశించింది.  ఏకంగా 8 అడుగుల ఎత్తున్న గోడను సైతం అవలీలగా  దూకిన చిరుత...తన పిల్లతో సహా ఇంట్లోకి వచ్చింది. ఇంటికి కాపలాగా ఉన్న కోకోపై దాడి చేసి ఇంటి వెనుక భాగం వైపుకు ఈడ్చుకెళ్లి చంపేశాయి.

 

 సీసీటీవీలో చిరుత అక్కడ తిరుగుతున్నట్లు స్పష్టంగా కనిపించడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. కోకో బరువు 42 కేజీలని, అయినా చిరుత తన కుక్కని దారుణంగా చంపేసిందని యజమాని ఆర్తి గుప్తా  తెలిపారు. పార్కుకు ఎటువంటి రక్షణ కంచె ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ సంఘటన జరిగిందని ఆమె ఆరోపించారు. చిరుతపులి తమ ప్రాంతంలో సంచరిస్తుదన్న విషయం తెలుసుకున్న స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement