breaking news
Sanjay Gandhi National Park
-
కుక్కపై పులి పంజా విసిరింది..
థానే: ఓ పెంపుడు కుక్క... చిరుతపులి, దాని పసికూన చేతిలో దారుణంగా ప్రాణాలు కోల్పోయింది. ఇందులో విశేషం ఏముందనుకుంటున్నారా! ఇది జరిగింది ఏ అడవిలోనో.. పార్కులోనో కాదు.. జనావాసాల మధ్య ఉన్న ఓ ఇంట్లో జరిగిన సంఘటన ఇది. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ సంఘటన రెండు రోజుల కిందట జరిగింది. తప్పిపోయిన పెంపుడు కుక్క.. కోకో గురించి ఇంటి యజమాని ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. సంజయ్ గాంధీ జాతీయ పార్కు నుంచి ఓ చిరుత ...తన పసికూనలో సహా తప్పించుకుని సమీపంలోని ఓ ఇంట్లోకి ప్రవేశించింది. ఏకంగా 8 అడుగుల ఎత్తున్న గోడను సైతం అవలీలగా దూకిన చిరుత...తన పిల్లతో సహా ఇంట్లోకి వచ్చింది. ఇంటికి కాపలాగా ఉన్న కోకోపై దాడి చేసి ఇంటి వెనుక భాగం వైపుకు ఈడ్చుకెళ్లి చంపేశాయి. సీసీటీవీలో చిరుత అక్కడ తిరుగుతున్నట్లు స్పష్టంగా కనిపించడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. కోకో బరువు 42 కేజీలని, అయినా చిరుత తన కుక్కని దారుణంగా చంపేసిందని యజమాని ఆర్తి గుప్తా తెలిపారు. పార్కుకు ఎటువంటి రక్షణ కంచె ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ సంఘటన జరిగిందని ఆమె ఆరోపించారు. చిరుతపులి తమ ప్రాంతంలో సంచరిస్తుదన్న విషయం తెలుసుకున్న స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. -
ఎస్జీఎన్పీ సందర్శకులకు ఎకోఫ్రెండ్లీ బస్సులు
సాక్షి, ముంబై: సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ (ఎస్జీఎన్పీ)ను సందర్శించే పర్యాటకుల కోసం ఎకోఫ్రెండ్లీ ఎలక్ట్రానిక్ బస్సులను నడిపేందుకు అధికారులు యోచిస్తున్నారు. ఈ బస్సుల కోసం ఈ పార్క్‌లోని ఉద్యానవనంలోని కొంత భాగాన్ని పార్కింగ్ లాట్‌గా తీర్చిదిద్దనున్నారు. ఎస్జీఎన్పీ పార్కులో ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు ఎంటీడీసీతో మాట్లాడుతున్నామని, అయితే పార్కింగ్ స్థలం కొరత వల్ల ఈ ప్రణాళికకు జాప్యం జరుగుతోందని ఓ అధికారి తెలిపారు. స్థలం ఖాళీ లేనట్లయితే గార్డెన్లో కొంత భాగాన్ని పార్కింగ్ లాట్‌గా తీర్చి దిద్దుతామని చెప్పారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సేవలు జూలై నుంచి అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. ఈ బస్సుల నిర్వహణ, చార్జీల సేకరణ మొత్తం ఎంటీడీసీ చూసుకోవాల్సి ఉంటుంది. ఈ బస్సులు ఎస్జీఎన్పీ మేయిన్ గేట్ నుంచి కన్హేరి కేవ్స్ వరకు నడుస్తాయి. ఇందుకు గాను చార్జీలను ఇంకా నిర్ణయించలేదు. ఇదిలా ఉండగా ఈ నేషనల్ పార్క్‌కు ఎడమ భాగంలో క్రిష్ణగిరి ఉద్యాన్ ఉంది. ఈ గార్డెన్‌ను అభివృద్ధి చేసి ఏడాది అవుతోంది. ఉదయం, సాయంత్రం వేళ్లలో వాకింగ్ చేసేవారికి ఈ గార్డెన్ హాట్‌స్పాట్‌గా మారింది. ఈ ఉద్యానవన అభివృద్ధికి గాను ఇప్పటికే రూ.10 లక్షల వ్యయం అయినట్లు అధికారి వెల్లడించారు. వివిధ రకాల పక్షులు, పూల మొక్కలు, చెట్లు అనేకం ఇక్కడ ఉన్నాయి. అయితే ఈ ఎలక్ట్రిక్ బస్సులను బయట పార్క్ చేయడం ద్వారా ట్రాఫిక్‌జామ్ సమస్యలు తలెత్తి పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొంటారని అధికారి వెల్లడించారు.