మేం రాజకీయాలు చేయం: గడ్కరీ | Land bill in national interest: Gadkari tells Sonia | Sakshi
Sakshi News home page

మేం రాజకీయాలు చేయం: గడ్కరీ

Mar 30 2015 5:57 PM | Updated on Oct 22 2018 9:16 PM

నితిన్ గడ్కరీ - Sakshi

నితిన్ గడ్కరీ

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాసిన లేఖకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తిరుగు జవాబు రాశారు.

న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాసిన లేఖకు కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తిరుగు జవాబు రాశారు. భూసేకరణ బిల్లు అంశంపై సోనియా గాంధీ  గత శుక్రవారం  గడ్కరీకి ఒక లేఖ రాశారు. భూసేకరణ బిల్లు వల్ల ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతులు నష్టపోతారని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. భూసేకరణ చట్టంలో కేంద్ర ప్రభుత్వం చేయబోతున్న సవరణలను కాంగ్రెస్ పార్టీ ఆమోదించదని సోనియాగాంధీ తెలిపారు.

ఈ లేఖకు గడ్కరీ హిందీలో సమాధానం రాస్తూ భూసేకరణ బిల్లు  జాతి ప్రయోజనాల కోసమేనని తెలిపారు.  కీలక విషయాలలో తాము రాజకీయాలు చేయం అని  పేర్కొన్నారు. అభివృద్ధి కోసమే భూసేకరణ బిల్లులో సవరణలు చేసినట్లు  గడ్కరీ ఆ లేఖలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement