మోదీ మంత్రివర్గంలో కొత్తగా చేరిన 21 మంది మంత్రుల ప్రమాణ కార్యక్రమం ఆదివారం రాష్ట్రపతి భవన్ దర్బార్ హాలులో కనుల .....
న్యూఢిల్లీ: మోదీ మంత్రివర్గంలో కొత్తగా చేరిన 21 మంది మంత్రుల ప్రమాణ కార్యక్రమం ఆదివారం రాష్ట్రపతి భవన్ దర్బార్ హాలులో కనుల పండుగగా జరిగింది. పారికర్, సురేష్ ప్రభు, రాజ్యవర్ధన్ మినహాయిస్తే.. మిగిలిన వారంతా సంప్రదాయ కుర్తా-పైజామా ధరించి హాజరయ్యారు.
సుజనా చౌదరి, సుప్రియో మినహా అందరూ హిందీలోనే ప్రమాణం చేశారు. కేబినెట్ విస్తరణలో చోటు దక్కించుకున్న వారిలో యూపీ ఎంపీ సాధ్వి నిరంజన్ జ్యోతి ఒక్కరే మహిళ. ఆమె చేరికతో మంత్రివర్గంలోని మహిళల సంఖ్య ఎనిమిదికి పెరిగింది.