breaking news
presedentBhavan
-
రాష్ట్రపతి భద్రతకు 155 కోట్ల ఖర్చు
ఆగ్రా: రాష్ట్రపతి భద్రతా సిబ్బంది జీతభత్యాల కోసం గత నాలుగేళ్లలో రూ.155.4కోట్లు ఖర్చు చేసినట్లు రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. లక్నోకు చెందిన నూతన్ ఠాకూర్ అనే హక్కుల కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు బదులిచ్చింది. భద్రతా సిబ్బంది జీతభత్యాల కింద 2014–15లో 38.17కోట్లు, 2015–16లో 41.77కోట్లు, 2016–17లో 48.35కోట్లు, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 27.11కోట్లు చెల్లించారు.భద్రతా వాహనాల నిర్వహణకు నాలుగేళ్లలో 64.9లక్షలు ఖర్చు చేశారు. వాహనాల్లో ప్రభుత్వం నిర్వహించే బంకుల్లోని పెట్రోల్‌ను వాడుతున్నందున ఆ ఖర్చును లెక్కల్లో చూపలేదంది. భద్రతా కారణాల రీత్యా మొత్తం సిబ్బంది, వాహనాల సంఖ్యను వెల్లడించలేమని పేర్కొంది. -
కుర్తా పైజామా ప్రత్యేకత...
న్యూఢిల్లీ: మోదీ మంత్రివర్గంలో కొత్తగా చేరిన 21 మంది మంత్రుల ప్రమాణ కార్యక్రమం ఆదివారం రాష్ట్రపతి భవన్ దర్బార్ హాలులో కనుల పండుగగా జరిగింది. పారికర్, సురేష్ ప్రభు, రాజ్యవర్ధన్ మినహాయిస్తే.. మిగిలిన వారంతా సంప్రదాయ కుర్తా-పైజామా ధరించి హాజరయ్యారు. సుజనా చౌదరి, సుప్రియో మినహా అందరూ హిందీలోనే ప్రమాణం చేశారు. కేబినెట్ విస్తరణలో చోటు దక్కించుకున్న వారిలో యూపీ ఎంపీ సాధ్వి నిరంజన్ జ్యోతి ఒక్కరే మహిళ. ఆమె చేరికతో మంత్రివర్గంలోని మహిళల సంఖ్య ఎనిమిదికి పెరిగింది.