సోమవారం సీఎంగా కుమారస్వామి.. కేబినెట్‌ ఇదేనా ! | Sakshi
Sakshi News home page

సోమవారం సీఎంగా కుమారస్వామి.. కేబినెట్‌ ఇదేనా !

Published Sat, May 19 2018 7:09 PM

KumaraSwamy Oath On Monday And Cabinet Ministers List Announced - Sakshi

సాక్షి, బెంగుళూరు : కర్ణాటక ముఖ్యమంత్రిగా జేడీఎస్‌ ఎల్పీనేత కుమారస్వామి ఈనెల 21న (సోమవారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప పదవి నుంచి తప్పుకున్న నేపథ్యంలో కుమారస్వామి సోమవారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ విషయంపై ఇప్పటికే బెంగళూరులోని హిల్టన్‌ హోటల్‌లో జేడీఎస్‌-కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా కేబినెట్‌ కూర్పు, ఇతర పదవుల పంపకాలకు సంబంధించి చర్చ జరిగింది. మంత్రులు వారి శాఖలను కూడా ప్రకటించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారానికి దేశం నలుమూలల నుంచి వివిధపక్షాల నాయకులను ఆహ్వానించనున్నట్లు తెలిసింది.


అందిన సమాచారం మేరకు మంత్రులు వారి పదవులు ఇలా ఉండవచ్చు

  • ముఖ్యమంత్రి, ఆర్థిక  శాఖా మంత్రి : కుమారస్వామి
  • ఉప ముఖ్యమంత్రి : జి పరమేశ్వర్‌
  • ప్రజా పనుల శాఖ : హెచ్‌ డీ రేవణ్ణ
  • విద్యుత్‌ శాఖ : డీకే శివకుమార్
  • నీటిపారుదల శాఖ : హెచ్‌కే పాటిల్‌
  • భారీ పరిశ్రమల శాఖ : ఏటీ రామస్వామి
  • రవాణా శాఖా : రామలింగారెడ్డి
  • చిన్న నీటిపారుదల శాఖ : కేఎం శివలింగే గౌడ్‌
  • రెవెన్యూ శాఖ : శివ శంకరప్ప
  • ఆరోగ్య శాఖ : యూటీ ఖదీర్‌
  • మహిళా సంక్షేమ శాఖ : లక్ష్మీ హెబ్బల్కర్‌
  • వ్యవసాయం, పశుసంవర్ధక శాఖ : సీఎస్‌ పుత్తరాజు
  • విద్యాశాఖ : హెచ్‌ విశ్వనాథ్‌
  • గ్రామీణాభివృద్ధి శాఖ : సతీష్‌ జరకిహోలి
  • పట్టనాభివృద్ధి : కేజే జార్జ్‌
  • క్రీడల శాఖ : కృష్ణప్ప
  • సమాచార శాఖ : కృష్ణ బైరేగౌడ
  • సాంఘీక సంక్షేమ శాఖ : హెచ్‌కే కుమారస్వామి
  • కోపరేటివ్‌ శాఖ : జీటీ దేవెగౌడ
  • టెక్స్‌టైల్‌ శాఖా : బండెప్ప కశంపూర
  • కార్మిక శాఖ : డీసీ తమ్మన్నా
  • ఎక్సైస్‌ శాఖ : దినేష్‌ గుండు రావు
  • వైద్య, విద్య శాఖ : తన్వీర్‌ సైత్‌
  • ఉన్నత విద్య శాఖ : కే సుధాకర్‌
  • అటవీ శాఖ : రోషణ్‌ బైగ్‌
  • ఆహార, పౌర సరఫరా శాఖ : శరణబసప్ప గౌడ దర్శణాపూర్
  • న్యాయశాఖ : ఆర్‌వీ దేశ్‌పాండే
  • చిన్న తరహ పరిశ్రమలు : అజయ్ సింగ్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ  : ప్రియాంక్‌ ఖర్గే

Advertisement
Advertisement