బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ ఓటమి | Kiren bedi loses from Krishna Nagar | Sakshi
Sakshi News home page

బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ ఓటమి

Feb 10 2015 12:56 PM | Updated on Mar 29 2019 9:31 PM

భారతీయ జనతా పార్టీకి పెద్ద షాక్. ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ ఓటమి పాలయ్యారు. బీజేపీకి కంచుకోటలాంటి ...

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీకి పెద్ద షాక్. ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ ఓటమి పాలయ్యారు.  బీజేపీకి కంచుకోటలాంటి కృష్ణనగర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆమె  ఆప్ అభ్యర్తి ఎస్కే బగ్గా చేతిలో పరాజయం పొందారు. కిరణ్ బేడీ 1150 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాగా ఓటమికి తానే బాధ్యత వహిస్తానని ఆమె పేర్కొన్న విషయం విషయం తెలిసిందే.

కాగా అసలు బీజేపీ సీఎం అభ్యర్థిగా కిరణ్ బేడీని ఎంపిక చేయడం ఆ పార్టీ చేసిన తప్పుగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  ఎన్నికల వచ్చే వరకూ బీజేపీ పరిస్థితి బాగానే కనిపించనప్పటికీ.. కిరణ్ బేడీ ఎంపికతోనే పార్టీ డీలా పడిందనేది ప్రధానంగా వినిపిస్తోంది. ఆ పార్టీ చేసింది చిన్నపాటి తప్పుగానే కొందరు చెబుతున్నప్పటికీ.. వెనక్కి తీసుకోలేనంత తప్పుగా మరికొంతమంది విశ్లేషిస్తున్నారు. ఢిల్లీ లాంటి చిన్న ఎన్నికను బీజేపీ భారీగా ఎంచుకోవడం ఆ వ్యూహాలు బెడిసి కొట్టాయనే ప్రధానంగా వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement