పోలీసుల ప్రచారం.. బిత్తరపోయాడు

Kiki Challenge Dead Man Reacts on Jaipur Police Ad - Sakshi

సాక్షి, తిరువనంతపురం/జైపూర్‌: ప్రపంచం మొత్తాన్ని ఊపేస్తూ చర్చనీయాంశంగా మారింది కీకీ ఛాలెంజ్‌. పోలీసులు మాత్రం అది ప్రమాదకరమైందంటూ ఆంక్షలు విధించేస్తున్నా.. యువత అవేం పట్టించుకోకుండా సవాల్‌గా తీసుకుని మరీ ఊగిపోతోంది. అయితే ఈ ఛాలెంజ్‌కు అడ్డుకట్ట వేసే క్రమంలో జైపూర్‌ పోలీసులు చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

‘ఇన్‌ లవింగ్‌ మెమోరీ ఆఫ్‌ కేకే.. కీకీ ఛాలెంజ్‌లో షీగ్గీ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు’ అంటూ దండేసి ఉన్న ఓ యువకుడి ఫోటో జైపూర్‌ పోలీసులు ట్విటర్‌ ఖాతాలో ఉంచారు. ‘ఛాలెంజ్‌ చేసి ప్రాణాలు తీసుకోకండి’ అంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఆ యాడ్‌ను కొచ్చి(కేరళ)కి చెందిన జవహార్‌ సుభాష్‌ చంద్ర(30) చూసి బిత్తర పోయాడు. అందుకు కారణం ఆ ఫోటోలో ఉంది అతనే కాబట్టే. సోషల్‌ మీడియాలో విస్తృతంగా ఆ ఫోటో వైరల్‌ కావటంతో ఏం జరిగిందోనన్న కంగారుతో బంధువులు అతనికి ఫోన్‌ కాల్స్‌ చేయటం ప్రారంభించారంట. మీడియా ముందుకు వచ్చిన జవహార్‌ ఈ విషయాన్ని చెబుతూ వాపోతున్నాడు. (కీకీ విన్నర్స్‌ ‘తెలంగాణ’ కుర్రాళ్లే...)

ఫోటో ఎలా దొరికిందంటే.. ఎక్కడో కొచ్చిలో ఉంటున్న అతని ఫోటో జైపూర్‌ పోలీసులకు ఎలా దొరికిందంటే.. 2008లో జవహార్‌ మోడలింగ్‌ చేసేవాడు. ఆ సమయంలో ఫోటోగ్రాఫర్‌ అయిన జవహార్‌ అంకుల్‌.. అతన్ని ఫోటోలు తీసి వాటిని షట్టర్‌స్టాక్‌లో ఉంచారు. ఆ సైట్‌ నుంచి ఫోటోలను కొనుగోలు చేసిన పోలీసులు ఇప్పుడు ఇలా యాడ్‌ ఇచ్చారన్న మాట. ‘ఇదొక ప్రచార కార్యక్రమం. ప్రజలకు మంచి చేయాలనే ప్రయత్నం. లీగల్‌గానే అతని ఫోటోను కొనగోలు చేశాం. ఎట్టి పరిస్థితుల్లో యాడ్‌ను వెనక్కి తీసుకోం. అతను అభ్యంతరం వ్యక్తం చేసినా సరే’ అని కమిషనర్‌ సంజయ్‌ అగర్వాల్‌ స్పష్టం చేశారు.
(దొంగతనం చేసి మరీ...)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top