
గెలుపు దిశగా ఆమ్ ఆద్మీ పార్టీ
ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు దిశగా పరుగులు తీస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 65 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు దిశగా పరుగులు తీస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 65 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ విజయభేరి మోగించడం ఖాయమని స్పష్టం అవుతోంది. ఢిల్లీ ప్రజలు ఆప్ వైపే మొగ్గు చూపుతున్నారని తేలిపోయింది. కాగా ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మ్యాజిక్ ఫిగర్ 36 స్థానాలు. దాంతో ఆప్ ఈసారి సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 673 మంది పోటీ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, బీఎస్పీ 70 నియోజకవర్గాలకు గాను 70 మంది అభ్యర్థులను బరిలోకి దింపాయి. కమలనాథులు 69 స్థానాల్లో పోటీ చేశారు. మరో స్థానాన్ని మిత్రపక్షం అకాలీదళ్‌కు కేటాయించారు.